మీసేవ ఇక మీ చేతుల్లో…!!! ఇలా లాగిన్ అవ్వండి.

Spread the love

రోజు రోజు పెరుగుతున్న టెక్నాలజీ ఫలితంగా, ప్రజలకి అన్ని సేవలు కూడా చాల సులభంగా చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. ముందుగా, ఏదైనా ధ్రువ పత్రాన్ని, ఆదయ ధ్రువీకరణ పత్రం లేదా కొత్త కరెంటు మీటరు మరి ముఖ్యంగా బర్త్ సర్టిఫికెట్ వాటి వాటికోసం, మీ సేవా కేంద్రాలను నమ్ముకుని, వాళ్ళు చెప్పినట్లా చేయాల్సి వచ్చేది మరియు దీనికి చాల సమయం కూడా కేటాయించాల్సి వచ్చేది.

అయితే, ఇప్పుడు కొత్తగా అందించిన mee seva 2.0 ఆన్లైన్ సేవ ద్వారా మీరే అన్ని ధ్రువపత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా కొత్త కరెంటు మీటరు మరియు 37 రకాల సేవలను మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అవసరమయిందల్లా కేవలం మీ స్మార్ట్ ఫోన్ మాత్రమే. ఇది చెయ్యడం చాలా సులభం.

ముఖ్యంగా, వచ్చేనెలలో స్కూల్స్ మొదలుకానున్నాయి, కాబట్టి బర్త్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం అని సవాలక్ష సర్టిఫికెట్ల కోసం మీరు తిరగాల్సివుంటుంది. కానీ ఇక్కడ ఇచ్చిన వివరాలతో, మీరు నేరుగా మీ స్మార్ట్ ఫోనుతో, లేదా నెట్ సెంటర్లో ఆయనా సరే చాల సులభంగా చేసుకోవచ్చు.

👉 Mee Seva 2.0 ఇలా లాగిన్ అవ్వండి ;

1. వెబ్సైటుని ఓపెన్ చేయాలి

2. ఇక్కడ మీకు KIOSK పక్కన ఇచ్చిన బటన్ నొక్కాలి

3. ఇక్కడ మీకు 3 ఎంపికలు వస్తాయి (KIOSK, CITIZEN, DEPARTMENT )

4. ఇక్కడ 2 వ ఎంపికయిన CITIZEN ఎంచుకోవాలి

5. ఇప్పుడు మీకు NEW USER అని క్రింద ఒక కొత్త ఎంపిక బటన్ వస్తుంది, దానిపైన నొక్కండి.

6. ఇప్పుడు మీరు ఒక కొత్త పేజీకి వెళ్తారు.

7. ఇక్కడ కోరిన అన్ని వివరాలను ఎంటర్ చేయండి. ( పేరు, పాస్వర్డ్, మొబైల్ నంబర్,ఆధార్ కార్డు నంబర్ మరియు చిరునామా)

8. ఇప్పుడు మీరు సూచించిన విధంగా మీ ID క్రేయేట్ చేయబడుతుంది.

9. మీ ID మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సిన సేవలను వినియోగించుకోవచ్చు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading