దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి లో ఎన్నో అద్భుతాలు… మరెన్నో వింతలూ.. విశేషాలూ.. అందులో పరమాద్భుతం పక్షుల వలస . పక్షుల వలస అనేది ఇప్పటి వరకూ అంతుచిక్కని ఒక రహస్యం . అవి ఒక ధ్రువం నుండి మరో ధ్రువానికి లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. తిరిగి దారిమరిచిపోకుండా వాటి సొంత ప్రాంతానికి వెళ్లిపోతాయి… . తమకు ఏమాత్రం తెలియని ప్రాంతాలనూ పలకరించి వస్తుంటాయి. ఈ క్రమంలో పర్వతాలు, సముద్రాలు, ఎడారులు.. అన్నింటినీ సులువుగా దాటిపోతుంటాయి. అయితే వీటికి 🔴ప్రయాణ మార్గం ఏలా తెలుస్తుంది? అవి భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించగలవని, దాని ఆధారంగా తమ మెదళ్లలో రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటాయని కొందంటారు. సూర్యుడు, నక్షత్ర గమనాల ఆధారంగా ప్రయాణిస్తాయని ఇంకో వాదన.
👉లాండ్‌మార్క్స్ ద్వారా : అవి ఏటా ఒకే మార్గంలో ఒకేచోటుకు వెళ్లొస్తాయి. కాబట్టి, ఆ మార్గంలో ఉండే భౌగోళిక గుర్తులను (లాండ్‌మార్క్స్) గుర్తుపెట్టుకుంటాయి. నదీలోయలు, సముద్రతీరాలు, పర్వతాలు ఇలా అన్నమాట. ఇక తమ మార్గ మధ్యంలో వినపడే ధ్వనులను బట్టీ అవి ప్రయాణ మార్గాన్ని పోల్చుకోగలవు.
🔴వలస పక్షుల ప్రత్యేక శరీర నిర్మాణం : వలస పక్షుల శరీర నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఈ పక్షుల రెక్కలు మామూలు పక్షుల రెక్కల కంటే పొడవుగా, బలంగా ఉంటాయి. అలాగే అంతంత దూరం వెళ్లాలంటే బాగా శక్తి కావాలి కదా. దానికేం చేస్తాయంటే, తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తమ శరీర పరిమా ణాన్ని పెంచేసుకుంటాయి. విపరీతంగా తిని కొవ్వును నిల్వచేసు కుంటాయి. 🔶రెట్టింపు పరిమాణంలోకిమారిపోయేపక్షి :.’జిట్ట( గార్డెన్ వార్బ్‌లర్) అనే పక్షి 18 గ్రాములే ఉంటుంది. అది వలసపోవడానికి ముందు తన బరువును 37 గ్రాములకు పెంచుకుంటుంది. అంటే రెట్టింపు పరిమాణంలోకి మారుతుందన్న మాట. తరువాత ప్రయాణంలో ప్రతి 1000 కిలోమీటర్లకూ 3-3.5 గ్రాముల కొవ్వును కరిగించుకుంటూ పోతుంది. చివరికి తను చేరాలనుకున్న ప్రాంతానికి చేరేసరికి అదనపు కొవ్వు మొత్తాన్ని కరిగించేసుకుంటుంది.
🔶 రీవపిట్ట (ఆర్కిటిక్ టెర్న్). : ఇది ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో పుడుతుంది. అంటార్కిటిక్ ధ్రువానికి వెళ్లి పిల్లలను పెట్టి, తిరిగి వస్తుంది. అంటే భూమికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్లి వస్తుందన్నమాట. వంద గ్రాములు ఉండే ఇది 40 రోజుల్లో 24,270 కిలోమీటర్లు ఎగురుతుంది.
🔶 హిమాలయ పర్వతాలనూ దాటేసే పక్షి : దక్షిణాసియాల్లో కనిపించే బాతుజాతికి చెందిన ఓ పక్షి తన వలస ప్రయాణక్రమంలో అది 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది. హిమాలయ పర్వతాలనూ దాటేస్తుంది.
🔶గాడ్విట్(‘బారుతోక నేలనెమలి’) పక్షి : తన ఒంట్లోని 55 శాతం కొవ్వును కరిగించుకుని, 11 వేల కిలోమీటర్ల దూరం ఎగురుతుంది.
🌟ఇంకో విచిత్రమయిన విషయం : కొత్త ప్రాంతంలో గుడ్లను పొదిగాక, ఆ పిల్లను వదిలేసి వస్తాయి చాలా పక్షులు. ఆ బుజ్జిపిట్టలు కూడా ఎవరో దారి చూపినట్టు, దూరతీరాల్లోని తమ అమ్మల సొంతగూళ్లకు ఎగిరొ చ్చేస్తాయి.
🔴పొంచి ఉండే ప్రమాదాలు : ఈ వలస పక్షులు వాటి ప్రయాణం లో అనేక ప్రమాదాలకు గురవుతుంటాయి. కరెంటు తీగలు, కాలుష్యం, వేట తదితరాల వల్ల చనిపోతూ ఉంటాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.