హైటెక్ మోసాలు అంటే ఇవేనేమో… కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించాడు..ఒక వ్యక్తీ
👉వివరాల్లోకి వెళ్తే : మోదీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంగాప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో 23 యేళ్ల ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ భారీ మోసానికి పథకం రచించించాడు. ‘‘ఉచిత ల్యాప్‌టాప్ పథకం’’ అంటూ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు.
🔴భారీ ఆన్‌లైన్ మోసం :ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత వివరాలు సేకరించి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించిన ఈ వ్యవహారంపై వివరాల్లోకి వెళితే…
👉నిందితుడు వివరాలు:
నిందితుడు పేరు రాకేశ్ జంగిద్ .రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా పుండ్లోటా అతడి స్వస్థలం.ఈ ఏడాది ఐఐటీ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
🔴 ప్రభుత్వ ఉచిత ల్యాప్‌టాప్‌లు అంటూ: ప్రధాని మోదీ రెండోసారి ఎన్నికైన సందర్భంగా అతడు ఓ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు. లక్షలాది మందికి ఉచితంగా ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు అందించనుందంటూ వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్‌లలో ఊదరగొట్టాడు. ఈ ప్రకటనలో ప్రధాని మోదీ ఫోటోతో పాటు మేకిన్ ఇండియా లోగోను కూడా జోడించడంతో… పెద్ద ఎత్తున ప్రజలు ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వ్యవహారం కాస్తా ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.సైపాడ్ ల్యాబ్స్ సాంకేతిక సాయంతో నిందితుడు రాకేశ్‌ను గుర్తించి అరెస్టు చేశారు.
👉 మోసానికి కారణం ఇది : హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ కంపెనీ ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని కాదని మరీ,వెబ్‌సైట్ ట్రాఫిక్ పెంచుకుని గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించేందుకే తాను ఈ వెబ్‌సైట్ తెరిచినట్టు రాకేశ్ విచారణలో అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు 👉కాగా ఈ వ్యవహారం పై విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.