‘సెల్ఫీ దిగితే జరిమానానా అని ఆశ్చర్యపోకండి..అది ఇక్కడకాదులేండి.చెన్నైలో..అది కూడా రైల్వే స్టేషన్లలో మాత్రమే. ‘అవును చెన్నై, రైల్వే స్టేషన్లలో ‘సెల్పీ’ తీసుకునేవాళ్ల నుంచి రూ. 2 వేల జరిమానా వసూలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 🔴ఎందుకంటే : ప్రస్తుతం ‘సెల్పీ’ సంస్కృతి వేగంగా వ్యాపిస్తోందని, ఇది ఒక రకమైన మనో వ్యాధి అని వైద్యులు చెబుతున్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు రైల్వే బ్రిడ్జిలపై రైలులో వెళ్తున్నప్పుడు మెట్లలో నిలబడి “సెల్ఫీ తీసుకుంటున్నారని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పట్టాలు దాటుతూ మృతి చెందేవారి సంఖ్య కన్నా పట్టాల వద్ద ‘సెల్ఫీ’ తీసుకుంటూ మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
దీనిని నివారించడానికి రైల్వే స్టేషన్లు, పటాలు, రైలు మెట్ల పైనుంచి ‘సెల్పీ
తీసుకునేవారికి రూ. 2 వేల చొప్పున జరిమానాగా విధిస్తున్నామన్నారు. 👉 అదే
విధంగా స్వచ్ఛభారత పథకం కింద రైల్వే స్టేషన్ ప్రాంగణంలో చెత్తకుండీలో
కాకుండా ఇతర స్థలాల్లో చెత్త వేసే ప్రయాణికుల నుంచి రూ. 500 చొప్పున అప
రాధంగా వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. మదురై డివిజన్ లో అనేక
రైల్వే స్టేషన్లలో ‘సెల్ఫీ’ తీసుకునేవారు, చెత్త వేసేవారిని గుర్తించి అక్కడికక్కడే
జరిమానా విధించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్ సిద్దంగా ఉన్నారన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.