Teluguwonders:
కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాక వాహనదారుల జేబులకు తూట్లు పడుతున్నాయి. 👉అయితే సాక్షాత్తూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారంటూ ఓ నెటిజెన్ పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
💥వివరాల లోకి వెళ్తే :
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ ధరించకుండా స్కూటర్ మీద రయ్యున వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోటారు వాహనాల సవరణ చట్టం అమలు తర్వాత ట్రాఫిక్ చలాన్ల భయంతో రోడ్డు మీదకి రావటానికి వాహనదారులు భయపడుతుంటే కేంద్ర రవాణాశాఖ మంత్రి మాత్రం హెల్మెట్ లేకుండా ఎలా వాహనం నడుపుతున్నారో చూడాలంటూ నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇక అది మొదలుకుని ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో కేంద్ర మంత్రి గడ్కరీని విమర్శిస్తూ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
🔴ఫేస్ బుక్ యూజర్ రుబి పఠాన్ పోస్ట్ :
‘కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసిన వ్యక్తి నాగ్‌పూర్ వీధుల్లో హెల్మెట్ లేకుండా వాహనాన్ని ఎలా నడుపుతున్నారో ఇక్కడ చూడాలంటూ’ ఫేస్ బుక్ యూజర్ రుబి పఠాన్ పోస్ట్ చేశారు. సామాన్యుల కోసమే ఈ నిబంధనలు.. నాయకులు మాత్రం రూల్స్ ఉల్లంఘిస్తారు. 12వేల రూపాయల విలువ గల వాహనానికి రూ.27వేల జరిమానా కట్టాల్సి వస్తుందని’ ఈ పోస్టులో పేర్కొన్నారు.
💥ఈ వీడియో ఇప్పటిది కాదని నిర్ధారణ :
నూతన మోటారు వాహనాల చట్టం నిబంధనలు అమలుకు ముందు నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపినట్లు చెక్ టీమ్ గుర్తించింది. 2014లో తీసిన వీడియోతో తాజాగా మంత్రి గడ్కరీపై దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టమైంది. ఈ వీడియో మోటారు వాహనాల చట్టం2019 అమలు చేయకముందు తీసిన వీడియో. 2014లో నితిన్ గడ్కరీ స్కూటర్ నడిపిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
నితిన్ గడ్కరీ వితౌట్ హెల్మెట్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే 2014లో హెల్మెట్ ధరించకుండా గడ్కరీ స్కూటర్ నడిపిన కథనాలు కనిపిస్తాయి. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలుసుకునేందుకు గడ్కరీ స్కూటర్ నడుపుతూ వెళ్లారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.