వైఫై.. మనకు బాగా అలవాటైన చాలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం .ఈ పదం తెలియని వారుండరు.వైఫై ని వాడని వారుండరు. ఇంటర్నెట్ వినియోగం కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో దీని వాడకం బాగా పెరిగింది.ఇండ్లు, ఆఫీసులు ఇలా అన్ని చోట్లా వినియోగంలో ఉంటోంది. మొబైల్స్‌లోనూ సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా మనం వాడే మొబైల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా దగ్గర్లో ఉన్న వైఫై సిగ్నల్ ద్వారా మనం ఇంటర్నెట్ ని ఉపయోగించుకోవచ్చు.
🔴వైఫై సమస్యలు : ఈ వైఫై సిగ్నల్ సరిగా అందక కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అంతేకాదు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వైఫై కంటే వేగవంతమైన కనెక్ట్విటీ కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
🔴 వై ఫై update అవ్వబోతుంది:వైఫై స్థానంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇది వైఫై కంటే వంద రెట్లు వేగంగా పని చేస్తుంది.
🔴 వైఫై కాదు లైఫై : సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం ఈ లైఫై. వైఫైకు అప్‌గ్రేడ్‌గా ఇది రానుంది. ఇది ఎలా పని చేస్తుంది.. అంటే
🔅లైట్ల ద్వారా పని చేసే లైఫై :
వైఫై వైర్లెస్ తరంగాల ఆధారంగా పనిచేస్తే, లైఫై కాంతి తరంగాల ద్వారా పని చేస్తుంది. కాంతి తరంగాల ద్వారా పనిచేస్తుం దంటే.. అన్ని లైట్ల ద్వారా మాత్రం కాదు. దీని కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎల్ఈడీ లైట్ల ద్వారా మాత్రమే.. ఆ ప్రత్యేక లైట్లలో లైఫైకి సంబంధించిన మోడెమ్‌ను అమరుస్తారు. దాని సహాయంతో పని చేస్తుంది. ఈ లైట్లను ఆన్ చేసినపుడు మోడెమ్ నుంచి కాంతి తరంగాలు లైట్ల ద్వారా బయటకు వస్తాయి. స్మార్ట్ ఫోన్, పీసీ, ల్యాపీకి అమర్చిన ప్రత్యేకమైన యుఎస్బీ ఆ కాంతి తరంగాలను గుర్తించి, వాటిని ఇంటర్నెట్ తరంగాలుగా మార్చి, డివైజ్‌లకు అందిస్తుంది. తద్వారా లైఫై పని చేస్తుంది.
🔴లై ఫై ఎక్కడ మొదలయ్యింది :
స్కాట్‌ల్యాండ్ కేంద్రంగా నడుస్తున్న ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన హెరాల్డ్‌హాస్ అనే శాస్త్రవేత్త 2011లో లైఫైను కనుగొన్నారు. అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో రకరకాల పరిశోధనలు చేశారు. ఈ లైఫై కంటితో చూడలేనంత వేగంగా పని చేస్తుంది. కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత ఎల్ఈడీ కాంతికిరణాల ద్వారా సెల్యులర్ టవర్ కన్నా అధికంగా లైఫై నుంచి డేటా వస్తుందని హెరాల్డ్‌హాస్ నిరూపించాడు. వైర్లెస్ ద్వారా జరిగే ఈ ప్రాసెస్ కోసం హెరాల్డ్‌హాస్ ఒక యాప్ రూపొందించి ప్రయోగాలు చేశారు. ఒకే ఎల్ఈడీ నుంచి ప్రసారమయ్యే మిణుకు మిణుకుమనే కాంతి ద్వారా సెల్యులర్ టవర్ కంటే అధికంగా డేటా ప్రసారమవుతుంది. మోర్స్ కోడ్లానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి ప్రసారం చేసినా కంటితో గుర్తించలేనంత వేగంతో కమ్యూనికేషన్ జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
🔴లైఫైసామర్థ్యం :
లైఫై ద్వారా 224 జీబీపీఎస్ (గిగాబైట్ పర్ సెకన్)సామర్థ్యంతో డేటాను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీతో పాటు పైలట్ ప్రాజెక్ట్‌లపై పరిశోధన చేసిన పరిశోధకులు స్మార్ట్‌లైట్ సొల్యుషన్ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ ద్వారా డిజైన్ చేసినట్లు గుర్తించారు. ఈ కొత్త వైర్లెస్ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్‌తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో ) కాంతి , బైనరీ కోడ్‌లో డేటాను బదిలీ చేస్తుంది.
🔴ఎలా పని చేస్తుంది..? :
విజిబుల్ లైట్ కమ్యూనికేషన్‌తో పనిచేసే లైఫై టెక్నాలజీ వైఫై కన్నా వంద రెట్లు వేగంగా పనిచేస్తుందని అంచనా.అంతేకాదు, ఇందుకు సంబంధించిన లైట్ల తయారీలో ఫిలిప్స్ భాగమైంది. వైర్లెస్ తరంగాలు వాడేందుకు వీలుకాని, చాలా ప్రదేశాల్లో లైఫైని సులభంగా వాడొచ్చు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం వినియోగ దారులకు పూర్తి సెక్యూరిటీని అందిస్తుంది. వైఫై గోడల ద్వారా బయటకు ప్రసారం అవుతుంది. లైఫై కేవలం ఒకే చోట ఉంటుంది. అందువల్ల లైఫై ద్వారా వచ్చే ఇంట ర్నెట్‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఇతరులు దాన్ని యాక్సెస్ చేయ లేరు. కార్పొరేట్ ఆఫీసుల్లో, ఇతర సంస్థల్లో లైఫై ద్వారా ఇంటర్నెట్ను సురక్షితంగా ఉపయోగించు కోవచ్చు. అంతే కాదు, సుస్థిరమైన, వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుంది.
🔴సెకనుకి ఒక సినిమా డౌన్లోడ్ : 30 ఎంబీపీఎస్ స్పీడులో పనిచేస్తుంది. సెకనులో ఒక సినిమా డౌన్లోడ్ అవుతుందంటే ఈ వేగం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.
🔴లై ఫై లోని లోపం :
చాలా వేగంగా పనిచేస్తుంది.. సెక్యూరిటీ యాక్సెస్ ఉంది.. అయినా ఇందులో కొన్ని లోపాలున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఏదైౖతే అడ్వాంటేజ్ అనుకుంటున్నామో దాని గురించే.. గది గోడలు దాటి వెళ్లలేదు. పెద్ద గదిలో లిప్త పాటులో అపరిమిత వేగంతో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుందే తప్ప మరో గదిలోకి వెళ్లలేదు. ఏ గదిలో ఉపయోగిస్తే ఆ గదికి మాత్రమే పరిమితమవు తుంది. అంటే.. ఆఫీసు మొత్తం ఒక పెద్ద హాలులా ఉంటేనే ఇది పనిచేస్తుంది.
భవిష్యత్‌లో..డేటాను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో ఆదరణ ఉంటుందని లైఫై పై అంచనా ఎక్కువగానే ఉంది. అయితే ప్రారంభ సమయంలో ఒలెడ్ కాం అనే ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడకంతో పాటు ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో ఇన్స్టాల్ చేసింది. ఆ తర్వాత లైఫై ఇప్పటికిప్పుడు వైఫై స్థానాన్ని భర్తీ చేయలేదని పేర్కొన్నారు. కానీ రానున్న రోజుల్లో సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.