ఇది ఇప్పటి మాట కాదు తెలుగు సినిమాకి స్వర్ణయుగం అని చెప్పుకునే పాత సినిమా నాటి ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య జరిగిన ఒక ముచ్చట . 👉ఇప్పుడంటే ,సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పటి సినిమాల గురించి మనకు తెలుస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి చిన్న సినిమా సంఘటన జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. మరి పాతకాలంలో…. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది. అప్పట్లో ఎవరో ఒకరు చెప్తేనే తెలిసేది. లేదంటే లేదు. అలా బయటకు వచ్చిన ఆ విషయం నోటి ద్వారానో లేదంటే పేపర్ ద్వారానో ఎప్పటికోగాని తెలిసేది కాదు. అందుకే పాతసినిమాలకు సంబంధించిన ముచ్చట్లు… అప్పటి తరానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ లు రెండు కళ్ళవంటి వారు. ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. అలా చేసిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. స్వతహాగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ఇండస్ట్రీలోకి ఏఎన్నార్ ముందుగా వచ్చినా.. ఎన్టీఆర్ చాలా స్పీడ్ గా పాపులర్ అయ్యారు. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక సినిమాల్లో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చేసిన పాత్రలు చిరస్థాయిగా మిగిలిపోతాయి.
దానవీరశూర కర్ణ సినిమా సమయంలో ఓ విచిత్రం జరిగింది. ఏఎన్నార్ చేత శ్రీకృషుడి గెటప్ లేదంటే కర్ణుడి గెటప్ వేయించాలని ఎన్టీఆర్ భావించాడు. ఏఎన్నార్ కు ఈ విషయం చెప్తే సున్నితంగా తిరస్కరించాడు. కారణం కూడా చెప్పాడు. శ్రీకృష్ణుడి పాత్ర ఎన్టీఆర్ చేస్తేనే బాగుటుంది. ఆ పాత్రలో మరొకరిని ఊహించలేం. ఇక తాను కర్ణుడిగా నటిస్తే… పాండవులు చిన్నవారై పోతారని అందుకే చేయలేనని చెప్పేశాడు. ఎన్టీఆర్ మాత్రం వదలలేదు. మరుసటి రోజే అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావును కలిసి విషయం చెప్పాడు. ఆయన ఏఎన్నార్ ను పిలిపించి ఇద్దరు కలిసి నటిస్తే బాగుంటుంది కదా అన్నారట. ఏఎన్నార్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత చాణక్య సినిమా సమయంలో ఏఎన్నార్ కు చాణక్యుడి పాత్ర ఇచ్చి తన మాట నెగ్గించుకున్నారు ఎన్టీఆర్.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.