ఒకినామా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

Okinawa Electric Scooter
Spread the love

Teluguwonders:

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకోవడంలో గణనీయమైన ప్రగతిని సాధించామని ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ వెల్లడించారు.

భారతీయ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పెట్రోల్ స్కూటర్ కంటే సమర్థవంతమైన ఉత్పత్తులను పరిచయం చేయాలనుకుంటోందన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలు బ్యాటరీ ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయని తెలిపారు. ఆఫీసులకు వెళ్లేవారికి, కుటుంబాలకు సంబంధించిన రోజువారీ ప్రయాణ అవసరాలను ఈ ప్రొడక్ట్ తీరుస్తుందన్నారు. అలాగే ఈ వాహనాలపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించిన కారణంగా ఇది అత్యంత చౌకైన స్కూటర్‌ అని శర్మ తెలిపారు.

ప్రైజ్‌ప్రో స్కూటర్‌ కీలక స్పెసిఫికేషన్స్‌
1000-వాట్ల బీఎల్‌డీసీ వాటర్‌ప్రూఫ్ ఎలక్ట్రిక్ మోటారు.ఇది 2.0 కిలోవాట్ డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. గరిష్ట శక్తి 2500 వాట్స్. 2 నుండి 3 గంటల్లో పూర్తి ఛార్జింగ్
స్పోర్ట్స్ మోడ్‌లో 90 కిమీ / ఛార్జ్, ఎకో మోడ్‌లో 110 కిమీ / ఛార్జ్.

బ్యాటరీ వారెంటీ:

3 సంవత్సరాలు లేదా 20000 కి.మీ (ఏది ముందు అయితే అది)

ఫైనాన్సింగ్ పార్టనర్‌లు: మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు

ఎకో మోడ్ 30-35 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుండగా, స్పోర్ట్స్ మోడ్‌లో 50-60 కిలోమీటర్ల వేగాన్ని, టర్బో అత్యధిక టాప్ స్పీడ్‌తో 65-70 కిలోమీటర్లు అందిస్తుంది. ఇంకా సెంట్రల్ లాకింగ్ విత్ యాంటీ-తెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ యుఎస్‌బీ పోర్ట్ , మోటర్ వాకింగ్ అసిస్ట్ విత్ ఫ్రంట్ అండ్‌ రివర్స్ మోషన్, రోడ్డుసైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ వంటి కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను ఇందులో జోడించింది. ఒకినావా ప్రైజ్‌ప్రోలో 150 కిలోల లోడింగ్ సామర్థ్యం ఉంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading