వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా నవరత్నాలు అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ఇక వృద్ధాప్య పెన్షన్లు 60 ఏళ్లకే అందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు వయోపరిమితి 65 ఏళ్లు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వయోపరిమితిని 60 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ల పెంపుపై మొదటి సంతకం చేసిన ఆయన.. వైఎ్‌సఆర్ పెన్షన్ కానుక పేరుతో అమలు చేయనున్న సామాజిక పెన్షన్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 🔴వృద్ధులతో పాటు వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు తదితరులకు నెలనెలా ఇక నుంచి రూ.2250 పింఛనుగా అందిస్తారు.
🔴వికలాంగులకు రూ.3 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ రోగులకు ఏకంగా రూ.3500 నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన పెన్షన్లు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని.. జూలై నెలలో లబ్ధిదారులకు అందిస్తారని గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం రాత్రి ఉత్త్తర్వులు జారీచేసింది. ఆ మేరకు ఆయా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా.. ఇక నుంచి దివ్యాంగులందరికీ నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ లభించనుంది. గత నెల వరకు రాష్ట్రంలో 👉దివ్యాంగులను రెండు కేటగిరీలుగా విభజించారు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి రూ.3000, వైకల్య శాతం 40 నుంచి 80 శాతం ఉన్న వారికి రూ.2000 అందజేశారు. 🎙తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దివ్యాంగులందరికీ సమానంగా నెలకు రూ.3,000 పెన్షన్ అందజేయనున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.