ప్రదక్షణలు ఎందుకు చేయాలి.?ఎలా చేయాలి..?

Spread the love

Teluguwonders:

వేల ఏళ్ల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం – ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ.

👉మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణ చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యునినుంచి శక్తి (సూర్యరశ్మి)ని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది.

ప్రదక్షిణ క్రియారూప ప్రణవ జపం అని శివపురాణం వర్ణించింది.దేవుని పూజలో షోడషోపచారా పూజలో చివరి అంకం.

🔴నిత్యజీవితంలో : ఏ బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఉద్యోగం కావాలన్న, గ్రహదోషాలు పోవాలన్నా మొదట చేసేది దేవాలయ ప్రదక్షిణలే.

👉ఎలా చేయాలి : సాధారణంగా ప్రదక్షిణలు దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి తిరిగి అక్కడికి చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణగా పరిగణిస్తారు.ఇలా కనీసం మూడు ప్రదక్షిణలు చేయాలి. వేదాంత పరంగా

1⃣మొదటి ప్రదక్షిణలో : మనషులు తమలోని తమోగుణాన్ని వదిలివేయాలి.

2⃣రెండో ప్రదక్షిణలో : రజోగుణాన్ని వదిలి వేయాలి.

3⃣మూడో ప్రదక్షిణలో : సత్వగుణాన్ని వదిలి వేయాలి.

తర్వాత దేవాయలంలోకి వెళ్లి త్రిగుణాతీతుడైన ఆ పరమాత్మను దర్శించుకోవాలి. అనేది అసలు పరమార్థం. దేవుని దేహమే దేవాలయంగా మనలోని షట్‌చక్రాలను దాటి హృదయంలోని దేవుడ్ని దర్శించాలనేది కాలాంతరంలో సాధించాలనేది వేదాంత పరమార్థం.ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయడం తప్పనిసరి.

🔴ఎన్నిసార్లు చేయాలి?

ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి అనే విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, కొందరు అయిదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి .

👉ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో మాత్రమే వుంటాయి. ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న. ఏ దేవుడి గుడికి వెళితే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం!


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading