ఒకే ఒక్క టీజర్ తో కుర్రకారు హృదయాలను పేల్చి పారేసింది.దాంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె అందరికీ ఓ కలల రాణి అయిపోయింది . ఆమె ఎవరో అర్థమైంది కదూ !!ఆమె ప్రియ ప్రకాష్ వారియర్.ఓ మలయాళ సినిమాకి తెలుగు వెర్షన్ అయిన “లవర్స్ డే “అనే సినిమాతో ఆ మధ్యన మన ముందుకు వచ్చింది. ఆ సినిమా కంటే ముందే రిలీజ్ అయిన టీజర్ లో తనని చూసిన ప్రేక్షకులు ఇండస్ట్రీ వారంతా కూడా ఇండస్ట్రీలో ఇక ఫ్యూచర్ అంతా ఆ అమ్మాయి దే అనుకున్నారు. దక్షిణాది సినిమాల్లోని లేటెస్ట్ హీరోయిన్స్ అందరికీ కూడా గట్టి కాంపిటేషన్ ఇస్తుందని అనుకున్నారు . అందరూ ఇలా ఆమె గురించి ఏవేవో అనుకున్నారు. కానీ ఇప్పుడు “అనుకున్నది ఒక్కటి ..అయినది ఒక్కటి ..బోల్తా పడ్డావు లే బుల్ బుల్ పిట్ట .. ” అంటూ ప్రియ ప్రకాష్ కు పాత సినిమా లోని ఒక పాటను గుర్తు చేస్తూ ఎగతాళి చేస్తున్నారు కొందరు.
🔴ఇంతకీ..ప్రియా ప్రకాష్ ఏం చేసింది : గతేడాది ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. ఆమె గతేడాది హైదరాబాద్ వచ్చినప్పుడు హీరోలంతా కూడా ఆమెనే తమ సినిమాలో నటింపచేయాలని పోటీలు పడ్డారు. అయితే ప్రియా వారియర్ మొదటి సినిమా ముందు వచ్చిన అల్లు అర్జున్ సినిమాలో అఫర్ ని పొగరుతో కాల తన్నుకుంది.
🔴 కోటి రూపాయల ఆఫర్ ని కాల తన్నింది :
నిర్మాత వేణిగేళ్ల ఆనంద ప్రసాద్ చంద్రశేఖర్ యేలేటి సినిమాకోసం ప్రియా వారియర్ కు కోటి రూపాయల పారితోషకం అఫర్ చేసారు. లవర్స్ డే సినిమా తనకి స్టార్ హీరోయిన్ గా ఒక తిరుగులేని స్టార్ ఇమేజ్ ని తీసుకు వస్తుందని మొదటి సినిమా విడుదలయ్యాక కోటికి మూడు రేట్లు పారితోషకం అందుకుంటానని ఒకటే మెరుపు కలలు కన్న ప్రియా ఆ ఆఫర్ ని బ్లైండ్ గా కాల దన్నింది.
🔴పాపం ప్రియ ఆశలు ఫలించలేదు : తన కెరీర్ పై ఎంతో..ఆశపడ్డ ప్రియవారియర్ ఆశలపై “లవర్స్ డే” సినిమా నీళ్లు చల్లింది. విడుదలైన అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అవటమే కాక, అసలు సినిమాకు ప్రియా వారియర్ మైనస్ అని, ఆమెకసలు నటనే రాదనీ తేల్చేసారు సినిమా పండితులు.ఇక అప్పటి వరకు ఆఫర్లతో ఆమెకోసం ఎదురు చుసిన నిర్మాతలు ఎవరూ కూడా ఆమె వంక కన్నెత్తి చూడలేదు.
🎊తాజాగా ఒక ఆఫర్ : తాజాగా టాలీవుడ్ లో ప్రియా వారియర్ ను నితిన్ సినిమా కోసం సెలెక్ట్ చేసారు. అదేనండి అప్పుడు కోటి పారితోషకం ఇద్దామనుకున్న చంద్రశేఖర్ యేలేటి సినిమా.
🔴 కోటి రూపాయల నుండి 15 లక్షల కి పడిపోయిన గ్రాఫ్ : ఇప్పుడు ఈ సినిమాకు ఆమెకిస్తున్న రెమ్యూనరేషన్ అక్షరాలా పదిహేను లక్షలు. కనీసం అఫర్ ఇచ్చారు సంతోషం. ఈమాత్రం రెమ్యూనరేషన్ ఇచ్చి అఫర్ ఇచ్చేవారు కోలీవుడ్లో, మలయాళం లో కూడా ఎవరు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు తనని చూసిన వారు “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పుగాదు కానీ అదే దీపంతో ఇంటిని తగల పెట్టుకోవడమే తప్పు” అంటున్నారు . ఇక నుండైనా జాగ్రత్తగా ముందుకు వెళితే మున్ముందైనా లాభం ఉంటుందని అంటున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.