Teluguwonders:
నగరంలో సగటు జీవి బ్రతుకు కన్నీటి సాగరం అవుతుంది.రోజంత చేసుకు వచ్చిన కష్టం కనీస అవసరాలకే సరిపోగా,పొదుపు అనే మాట చూర్లో పొగలా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైతే ఏంటి,హర్డ్‌వేర్ ఇంజనీరైతే ఏంటి.అందరివి ఒకటే కష్టం.డబ్బుల కష్టం.పెరిగిన ధరలు,ఇబ్బంది పెట్టే ఇంటి రెంట్లు.ఇవన్ని మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. స్వంత ఇంటిలో వున్న వాళ్లకి తెలియదు రెంటు కష్టాలు అంటున్నారు కొందరు.ఇక ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేవారు బ్యాచిలర్స్‌కు,ఫ్యామిలీకి అని డివైడ్ చేసి రెంట్లు బాగా వచ్చే విధంగా బ్యాంకుల్లో లోన్లు తీసుకుని నిర్మాణ పనులు చేపడుతున్నారు.ఇల్లు కట్టెటప్పుడు ఇంటి ఓనర్‌కు సినిమా కనిపిస్తే కట్టడం పూర్తి ఐనాక రెంట్లు కట్టెవాళ్లకి పార్ట్ పార్ట్ గా ఆ సినిమా చూపిస్తున్నారు.
ఇంకా రెంట్లు కాస్త తక్కువగా వున్న ఏరియల్లో అద్దెకు తీసుకుందామంటే ఆఫీస్‌కు చాల దూరం అవుతుంది.ఈ ట్రాఫిక్‌లో అంత దూరం ప్రయాణం చేసేటంత రిస్క్ తీసు కోవడం లేదు కొందరు.నగరంలో ఉన్న ప్రధాన ఏరియల్లో రెంట్ల సంగతి చెప్పవలసిన అవసరంలేదు.గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం రెంట్ల విషయంలో ఎంతగానో వ్యత్యాసం కనిపిస్తుంది.అభివృద్ధి చెందుతున్న నగరంలో అద్దెకష్టాలు అంతాఇంతా కావు.కనీసం ఒక గది అద్దెకు తీసుకోవాలంటే 6000 వేల రూపాయలనుండి ముప్పైవేల రూపాయల వరకు ప్రాంతాన్ని బట్టి అద్దెలు మారుతున్నాయి.ఉద్యోగం చేస్తున్నామనే ఆనందం కంటే,నెలకు వచ్చే జీతంఈ జీవితానికి ఎటూ సరిపోతలేదనే బాధ కొందరిలో కనిపిస్తుంది.
ఇక,కుకట్‌పల్లి,మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్,జూబ్లిహిల్స్,గచ్చిబౌలి,హైటెక్‌సిటి, వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు,మల్టీఫ్లెక్స్‌లు,నాన్ బ్యాంకింగ్ తదితర కంపెనీలతో పాటుగా ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు,ఫార్మా కేంద్రాలు వున్నాయి అందుకే జాబ్‌కు అందుబాటులో రూం అద్దెకు తీసుకుంటే హయిగా,ట్రాఫిక్ తో ఇబ్బందిలేకుండా సమయానికి వెళ్లిరావచ్చనే ఆలోచన వున్నవారు లేకపోలేదు.అందుకే వీరి అవసరాలు ఆసరగా చేసుకొని అద్దె గదులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది.అన్ని వసతులు న్నసౌకర్యవంతమైన గది కావాలంటే ఆ మాత్రం అద్దె చెల్లించాల్సిందేనని కొందరు ఫిక్సైపోయారు.ఏదిఏమైన నగరంలో అద్దె ఇంట్లో జీవించడం అనేది కంటికి కనిపించని ఓ రకమైన ఇబ్బందే కాని తప్పదు.సాఫ్ట్‌వేరైన,సామాన్యుడైన స్వంత ఇల్లు ఉంటేనే ఆదాయం తక్కువున్న హాపిగా ఉండగలడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.