సైకో శ్రీనివాస్ రెడ్డి లాగానే మరో సైకో ఉత్తరాదిన బయటపడ్డాడు. ఐదుగురు మహిళల్ని దారుణంగా హతమార్చిన ఈ సైకో ఎట్టకేలకు బెంగాల్ పోలీసులకు దొరికిపోయాడు.2013 నుంచి ఇలాంటి దారుణాలు జరుపుతుండగా.. గత నెలలో ఇతని పాపం పండి పోలీసులకు చిక్కాడు. మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసి వారిని సైకిల్ చైన్, ఇనుపరాడ్‌తో చంపి..రక్తంలో తడిసిన వారి శరీరాలతో తన పశువాంఛను తీర్చుకున్నాడు..వాడు. ముగ్గురు బాలికలను హతమార్చి వారి శవాలతో తన పశువాంఛ తీర్చుకున్న హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి ఉదంతం ఇంకా మర్చిపోక ముందే..సేమ్ సైకో శ్రీనివాస్ రెడ్డి లాంటి మరో వ్యక్తిబయలు దేరాడు.
🔴వివరాల్లోకి వెళ్తే :
ఈ సైకో పేరు కమ్ముర్జమాన్ సర్కార్.. పశ్చిమ బెంగాల్ బర్డ్వాన్ జిల్లాలో కమ్ముర్జమాన్ సర్కార్(42) చిన్న సైజు వ్యాపారి.
👉 కరెంట్ బిల్లులు పేరుతో:మధ్యాహ్నం పూట ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేసుకుని దారుణనికి పాల్పడేవాడు. కరెంట్ బిల్లులు పేరుతో ఇంట్లో ప్రవేశించేవాడు. అదును చూసి మహిళ తల మీద ఇనుప రాడ్‌తో బాదేవాడు. అప్పటికి వారు చనిపోకపోతే.. మెడకు సైకిల్ చైన్ బిగించి హత్య చేసేవాడు. అనంతరం ఆ మృత దేహాలతో తన కామ కోరిక తీర్చుకునే వాడు.
గత నెల 21న గోరా గ్రామంలో ఓ మహిళను ఇలాగే అంతమొందించి పోలీసులకు చిక్కాడు. విచారణలో అతని దారుణాలు ఒక్కోటి వెలుగులోకి వచ్చాయి. 2013 నుంచి ఇప్పటి వరకూ ఇదే విధంగా నలుగురు మహిళలు హత్యకు గురయ్యారు. వాటిలో సర్కార్ పాత్ర గురించి పోలీసులు అతన్ని ప్రశ్నించగా.. ఆ హత్యలను తానే చేసినట్లు సర్కార్ ఒప్పుకున్నాడు.
🔴దొంగ లపై కేసు మళ్లేలా :
తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం హత్య చేసిన ఇంటి నుంచి కొన్ని విలువైన వస్తువులను తీసుకెళ్లేవాడినని.. దాంతో అందరి దృష్టి దొంగల మీదకు వెళ్లేదని సర్కార్ విచారణలో వెల్లడించాడు. ఇప్పటి వరకూ సర్కార్ చేతిలో బలైన వారంతా మధ్యవయసు మహిళలే కావడం గమనార్హం. సర్కార్‌కు వివాహం అయ్యిందని.. ముగ్గురు సంతానం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భార్యతో గొడవల నేపథ్యంలోనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతన్ని బెంగాల్ పోలీసులు 12 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.