సేవ చేస్తున్న పేరుతో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల.. 👉 తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో.. అశోక్ నగర్‌లో అలాంటి గుట్టు రట్టైంది.
👉”అమ్మ” వృద్ధాశ్రమం : స్థానికంగా నివసిస్తున్న భాగ్యలక్ష్మి…. అమ్మ పేరు తో వృద్ధాశ్రమం స్థాపించింది. అది చూసిన వాళ్లంతా… ముసలివాళ్లపై ఆమెకు ఎంత ప్రేమ అనుకున్నారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మెచ్చుకుంటూ… తలో కొంతా విరాళంగా ఇచ్చారు. చేతికొచ్చిన కన్నబిడ్డలు పట్టించుకోకపోతే, దిక్కులేనివారవుతున్న ముసలి తల్లిదండ్రులు చాలా మంది ఆ వృద్ధాశ్రమానికి వెళ్లి, అక్కడ ఏదో ఒక పని చేస్తూ… జీవితాన్ని వెళ్లదీసుకుంటున్నారు. ♦ఐతే… ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. వృద్ధాశ్రమం పేరుతో భాగ్యలక్ష్మి… తెరవెనక చేస్తున్న తంతు వేరు.
👉వ్యభిచార దందా : వ్యభిచారం చేస్తున్న మహిళలతో డీల్స్ కుదుర్చుకుంటున్న భాగ్యలక్ష్మీ వాళ్లను తన ఇంటికీ, వృద్ధాశ్రమానికీ రప్పించుకొని… ఈ వ్యవహారం నడిపిస్తోందని దర్యాప్తులో తేలింది.
👉పోలీసుల రైడ్ :
రామగుండం వన్ టౌన్ పోలీసులకు ఎవరో కాల్ చేసి భాగ్యలక్ష్మి నిర్వాకంపై సమాచారం ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పోలీసులు సీక్రెట్‌గా దాడి చేశారు. ఒకేసారి భాగ్యలక్ష్మి ఇంటిపై, ఆశ్రమంపై దాడి చేశారు. ఈ క్రమంలో… అక్కడ వ్యభిచార తంతు జరుగుతున్నట్లు తెలిసింది. స్పాట్‌లో ఐదుగురు ప్రాస్టిట్యూటర్లను, ఏడుగురు విటులను పట్టుకున్నారు. భాగ్యలక్ష్మి సహా అందర్నీ అరెస్టు చేశారు. వారి నుంచీ కొంత నగదు, 3 బైకులూ, 9 సెల్ ఫోన్లూ స్వాధీనం చేసుకున్నారు.
వృద్ధాశ్రమం పేరుతో వ్యభిచారం జరుగుతోందని తెలిశాక… అందులో ఉంటున్న ముసలివాళ్లు… ఆ ఆశ్రమం నుంచీ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.