ప్రయాణికుడు బ్యాగ్ విసరడంతో రైల్లో మంటలు, పరుగులు పెట్టిన జనం

Spread the love

ఓ ప్రయాణికుడు లోకల్ రైలు మీద బ్యాగ్ విసిరాడు. దీంతో రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మంటలు ఎలా వచ్చాయి?

 ప్రయాణికుడు రైలుపై బ్యాగ్‌ను విసిరాడు. అది రైలు ఇంజిన్ మీద ఉండే విద్యుత్ వైర్ల మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టారు. ఈ ఘటన బుధవారం ముంబయిలోని వశీ రైల్వే స్టేషన్‌లో పన్వేల్‌కు వెళ్లే లోకల్ రైలులో చోటుచేసుకుంది.

ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. తొక్కిసలాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం తర్వాత ఆ బోగీని రైలు నుంచి వేరు చేసి.. షెడ్‌‌కు తరలించారు. లోకల్ రైళ్ల బోగీలపై వైర్ల నుంచి కరెంటును స్వీకరించే కనెక్టర్లు ఉంటాయి. ఇవి విద్యుత్తును గ్రహిస్తేనే రైలు ముందుకు వెళ్తుంది.

ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే స్పందిస్తూ.. గుర్తుతెలియని ప్రయాణికుడు లోకల్ రైలుకు ఉండే పాంటోగ్రాఫ్ మీద బ్యాంగ్ పడేశాడు. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఏర్పడ్డాయి. దీనివల్ల రైలు రాకపోకలకు 12 నిమిషాలు అంతరాయం ఏర్పడింది’’ అని ట్వీట్ చేసింది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు రైళ్లపై ఎలాంటి బ్యాగ్‌లు, వస్తువులు తదితరాలు విసరొద్దని కోరింది.

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading