గత ప్రభుత్వం రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఆహార సరఫరా బాధ్యత ‘అక్షయపాత్ర’ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.
🔴అన్న క్యాంటీన్లు : రాష్ట్రంలో నిరుపేదలకు రుచి, శుచికరమైన భోజనం పెట్టించే సంకల్పంతో.. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసినవి. 👉రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 25 మున్సిపాలిటీల పరిధిలో 60 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. 🔹మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.15కే లభ్యం కానుంది. 🔹ప్రతీ రోజు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశారు. అయితే, ఈ అన్న క్యాంటీన్లు టీడీపీ జమానాలో దారి తప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశం టీడీపీ ఓట్ల కోసమే ఉపయోగించుకుంది.
🔴ఇక రాజన్న కాంటీన్లు :
కాగా, తాజాగా కొత్త ప్రభుత్వం అన్న క్యాంటీన్ల రూపురేఖలు మార్చేందుకు సిద్ధమైంది. అన్న క్యాంటీన్‌కు “రాజన్న క్యాంటీన్” అని పేరు పెట్టి పూర్తి స్థాయిలో ఇది పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలందరికి నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రాజన్న క్యాంటీన్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాంటిన్ చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదటగా ఈ రాజన్న క్యాంటీన్ నరసరావుపేటలో ఏర్పాటైంది.ఆ ఫోటోను పలువురు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు.
🔴లోపాల దిద్దుబాటు :
గత అన్న క్యాంటీన్‌లలో ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ నమోదు చేసే అవకాశం ఇచ్చారు. అయితే, అవి కేవలం నామమాత్రమే గా ఉండేవి …దాంతో పర్యవేక్షణ కొరవడి గాడి తప్పాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.