దాదాపు 600 పైగా సినిమాలలో నటించిన ప్రముఖ సీనియర్ నటుడు రాళ్ళపల్లి మరణంతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. కానీ రాళ్ల పల్లి విషయంలో అన్యాయం జరిగిందని అంటున్నారు కొంతమంది..
👉విషయంలోకి వెళ్తే: రాళ్లపల్లి మరణానంతరం ఇప్పటి వరకు స్టార్స్‌లో ఒక్క చిరంజీవి మాత్రమే రాళ్లపల్లి మరణంపై స్పందించాడు. మిగిలిన వాళ్ల నుంచి కనీసం ఎటువంటి స్పందన కూడా లేదు . చిన్న వాళ్లు చనిపోతే పెద్దోళ్లు కనీసం పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాంటి సీనియర్ నటుడు చనిపోతే కనీసం చూడ్డానికి కూడా స్టార్స్ ఎవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాసరి, నాగేశ్వరరావ్ లాంటి మహామహులు మరణించినపుడు మాత్రమే ఇండస్ట్రీ అంతా కదిలొస్తుందని.. ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు లాంటి స్టార్ కమెడియన్లు,ఇక గుండు హనుమంతరావు, కొండవలస లాంటి వాళ్లు పోయినపుడు కూడా కనీసం ఎవరూ చూడ్డానికి కూడా రాలేదు. .
👉రాళ్లపల్లికి కొంతమంది మాత్రమే సంతాపం : ఆయన పోయారని తెలుసుకుని తణికెళ్ల భరణి, అలీ లాంటి ఒకరిద్దరు సీనియర్ నటులు తప్పిస్తే పెద్దగా ఎవరూ వచ్చింది లేదు. ఒక్క చిరంజీవి మాత్రమే రాళ్లపల్లి మరణంపై స్పందించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్. చెన్నైలోని వాణి మహల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి తాను రాళ్లపల్లిని చూసానని.. అక్కడే ఆయనతో పరిచయం అయిందని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్.అప్పట్లో ఆయన స్టేజీపై చేసే నటనను చూసి తాను మంత్ర ముగ్దుడినయ్యానని అన్నారు అన్నయ్య. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి కొన్ని సినిమాలు చేసినట్లు గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. ఈ మధ్యే మా ఎలక్షన్స్ సమయంలో ఆయన్ని చివరిసారి కలిసినట్లు చెప్పారు చిరంజీవి. అదే ఆఖరి చూపు అవుతుందని అనుకోలేదని.. రాళ్ళపల్లి లాంటి సీనియర్ నటుడి మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పారు మెగాస్టార్.. ఈ కాంట్రవర్సీ పై tollywod లో..ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.