ఘనంగా.. జరిగిన రంజాన్ పండుగ…

Spread the love

ముస్లింలు సోదరుల రంజాన్ ఉపవాసాలు మంగళవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్‌లు ప్రకటించడంతో రంజాన్ వేడుకలు ప్రపంచవ్వాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి…ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. . కాగా పలు మసీదుల వద్ద ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండంతో… మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

🔴అసలు రంజాన్ అంటే ఏమిటి !!! : ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘

🔹రోజా( ఉపవాసం ):ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘ రోజా ‘ అని , అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.

👉రంజాన్ నెల లో చేయాల్సిన 2 ముక్యమైన దానాలు : రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. 👉ముఖ్యమైన దానాలు2 :

🔴1.జకాత్ : సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘ జకాత్ ‘ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ‘ జకాత్’ అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ‘ జకాత్ ‘ ఉపయోగపడుతుంది.

🔴2..ఫిత్రాదానం : జకాత్’ తో పాటు ‘ ఫిత్రా’ దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ‘ ఫిత్రాదానం’ అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading