ఒక్కోసారి బ్యాంకులకు సెలవు దినాలు అయినప్పుడు లేదా మన చేతిలో డబ్బులు లేనప్పుడు మొబైల్ యాప్ ద్వారా నగదు రహిత చెల్లింపులు అనేవి ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా మారాయి. చేతిలో ఒక సెల్ఫోన్ దానిలో ఒక నగదు రహిత యాప్ ఉంటే చాలు బ్యాంకు వర్కు వెళ్లకుండానే మనీ ని రిసీవ్ చేసుకో వచ్చు లేదా సెండ్ చేసుకోవచ్చు. చాలా చోట్ల ఈ నగదు రహిత చెల్లింపులు అనేవి ఊపందుకున్నాయి తాజాగా ఇప్పుడు రేషన్ షాపుల వైపు కూడా ఈ సౌకర్యం మళ్ళింది.
👉హైదరాబాద్‌లోని రేషన్ షాపుల్లో త్వరలోనే నగదు రహిత విధానం : హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో త్వరలోనే నగదు రహిత విధానాన్ని తీసుకొస్తామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సభర్వాల్ తెలిపారు. టీ వాలెట్ యాప్‌ను అన్ని పీడీఎస్ దుకాణాలకు అనుసంధానం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులను డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు వివరించారు.
👉 టీ వాలెట్ యాప్ విడుదల : సచివాలయంలో టీ వాలెట్ యాప్‌ను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభర్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ఇక నుంచి టీ యాప్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. జయేశ్ రంజన్ మాట్లాడుతూ అన్ని సంస్థలకు టీ వాలెట్‌ను అను సంధానిస్తున్నామని, త్వరలోనే టోల్‌ప్లాజా వద్ద కూడా చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. మీ సేవా కేంద్రాలలో టి వాలెట్‌లో డబ్బులు వేసుకోవచ్చని సూచించారు. రేషన్ సరకులకు సొమ్మును టీ వాలెట్ ద్వారా చెల్లించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేలకు పైగా రేషన్ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.