Latest

    విడుదల..అయిన ‘సచివాలయ’ AHA పరీక్ష ఆన్సర్ ‘కీ’ -ఉత్తీర్ణులైతే చాలు ఉద్యోగం

    Teluguwonders:

    AP Grama Sachivalayam Exam Answer Keys 2019 | గ్రామ సచివాలయ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప రీక్ష ప్రాథమిక ‘కీ’ని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక కీపై సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది ‘కీ’తోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.

    ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాతపరీక్షలు నిర్వహించారు.

    👉ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష నిర్వహించగా..

    👉మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10,680 పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న రాతపరీక్షలు నిర్వహించారు.

    👉794 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకుగానూ మొత్తం 12,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

    💥పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు ..ఉద్యోగం:

    9,886 ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఈ పోస్టులకుగానూ మొత్తం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. 5612 మంది పరీక్షకు హాజరయ్యారు. దీంతో పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు ఉద్యోగాలకు ఎంపికైనట్లే అని అధికారులు తెలిపారు.
    👉ఉదయం నిర్వహించిన విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ కీని సాయంత్రం విడుదల చేసిన అధికారులు.. 👉మధ్యాహ్నం నిర్వహించిన ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్ష ప్రిలిమినరీ కీని రాత్రి 9 గంటల తర్వాత విడుదల చేశారు. కీపై అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబరు 9న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading