Teluguwonders:
మతం అంటే మంచికి దారి చూపే ఒక దారి .లేదా దేవుని చేరుకునే మరో దారి . దేవుణ్ణి ఎవరు ఏ మార్గంలోనైనా చేరుకోవచ్చు .అందుకే ఈ భూమిపై ఇన్ని రకాల మతాలు వెలిశాయి. మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు మతాలు అని ఒక భావన.
అన్ని మతాలకు సమానంగా అనువర్తించే నిర్వచనం అసలు సాధ్యమే కాదు. “అతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణే మతం” అన్నారు కొందరు. ఆ అతి ప్రాకృతిక శక్తులు దేవత కావచ్చు, దయ్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అయితే ఈ దేవత దయ్యాలు అన్ని మతాలకు సామాన్యం కావు.
అయితే దేవున్ని ప్రార్ధించే భక్తులు అది ఏ మతానికి చెందిన వారైనా..మంచి ఆలోచనలతో ఉండాలి..పక్క మతాల కు గౌరవాన్ని ఇవ్వాలి..వారిపై ఎటువంటి ద్వేషం చూపించకూడదు…కానీ అదే జరిగింది. ఒక చోట..
👉విషయం ఏమిటంటే : హిందుత్వవాదంతో ముస్లింలపై దాడులకు తెగబడుతున్న ఘటనలు దేశంలో అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఆవు మాంసం తిన్నారనీ…జై శ్రీరామ్ అనలేదని ముస్లింలపై దాడులకు పాల్పడుతున్నారు కొందరు.
🔴వివరాల్లోకి వెళ్తే :ఓ ముస్లిం మత పెద్దను ‘జైశ్రీరాం’ అనమని ఒత్తిడి తెచ్చారు. దానికి అతడు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన సదరు దుండగులు అతడిని కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఢిల్లీలోని అమన్ విహార్‌లో జరిగింది.
🔴కారుతో గుద్ది :
బాధితుడు మౌలానా మోమిన్ (40) చెప్పిన వివరాల ప్రకారం..ఓ పనిమీద ఇంటినుంచి బైటకొచ్చాడు. కారులో వచ్చిన ముగ్గురు యువకులు తనను ‘జై శ్రీరాం’ అని నినాదం చేయమని అడిగారు. దానికి అతడు అంగీకరించకపోవటంతో ఆ యువకులు మోమిన్ ను తీవ్రంగా దూషించారు. అనంతరం కారుతో గుద్ది గాయపరిచారు. ఈ గాయాలకు అతడు స్పృహ తప్పిపోయాడు. ఇది గమనించిన స్థానికులు మోమిన్ ను సుల్తాన్ పురిలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఈ ఘటనపై మోమిన్ ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
🔴 కాగా కేస్ మారిపోయింది : కాగా మోమిన్ చేసిన ఫిర్యాదును పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ వల్ల బాధితుడు గాయపడినట్లుగా కేసు నమోదు చేసుకున్నట్లుగా బాధితుడు ఆరోపిస్తున్నాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.