రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది
‘ఇలా చేయడం స్వాతంత్ర్యం అనుకుంది. కానీ దీని వలన తనకి ఉన్న సహజ భద్రతని కోల్పోతోందని తెలుసుకోలేకపోతోంది ఆధునిక యువతి.” అంటూ తన రక్షణ కవచం నుంచి బయటకు వచ్చి నిల్చున్న తాబేలు ఫోటోను షేర్ చేస్తూ రష్మికి కొందరు కౌంటర్ ఇచ్చారు
విషయం లోకి వెళ్తే : పెరిగిపోతున్న అత్యాచారాలకు కారణం వారి వస్త్రధారణే అని చాలా మంది వాదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్ ఫోజ్ చేసే విధంగా చిట్టి పొట్టి దుస్తులు, స్కర్టులు ధరించడం వల్లే పురుషుల్లో అలాంటి దుర్భుద్ధి కలుగుతుందంటూ కొందరు ప్రముఖులు సైతం బహిరంగ ప్రకటనలు చేశారు.
దీని పై రష్మీ కౌంటర్ ఇచ్చారు :ఇలా వాదిస్తున్న వారిని ఉద్దేశించి తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కారణాలు వెతకడం మానండి, మహిలను లొంగదీసుకోవడానికి టన్నులకొద్దీ కారణాలు ఉన్నాయి. ఇలాంటి అడ్డమైన వాదన ఆపండి అంటూ రష్మి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు.
రేష్మి గౌతమ్ మాట్లాడుతూ :మినిస్కర్టులు రాక ముందు రేప్ వచ్చింది,రేప్ అనేది ఫ్యాన్సీ వర్డ్ కాదు.. దయచేసి ఆ పదాన్ని జోక్‌గా వాడొద్దు. అలాంటివి జరిగినపుడు మహిళలు ఎంతో నరకం అనుభవిస్తున్నారు. ఈ ప్రపంచంలోకి మిని స్కర్టులు రాక ముందే రేప్ వచ్చింది… ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని రష్మి గౌతమ్ చెప్పుకొచ్చారు. రష్మి ట్వీట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.మోసం చేయాలనే ఆలోచన తప్ప.. బాగు చేయాలనే ఆలోచన లేదు
‘బాగా చెప్పారు రష్మీ జీ.. ఎవరిని ఎలా మోసం చేయాలనే ఆలోచన తప్ప.. వాడిని బాగు చేద్దామనే ఆలోచన లేదు. పేరెంట్సే అలా చేస్తుంటే పిల్లలు కూడా అదే దారి ఫాలో అవుతున్నారు. అందుకని ముందు వారి పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉంది. వాడికి ఇది తప్పు, అది మంచి అని చెబుతూ పరిశీలిస్తూ ఉండాలి. ‘ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
అందరి కళ్లు తెరిపించావ్:చాలా మంచి ట్వీట్ చేశారు. రేప్ జరుగడానికి అమ్మాయిల వస్త్రధారణే కారణం అనే వారి కళ్లు తెరిపించావ్. నీవు చాలా అందమైన హృదయం కలిగి ఉన్నావు. అందుకే ఇలాంటి మంచి పోస్టులు చేస్తున్నావు. వెరీ నైస్… అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
కొన్ని సార్లు అదే రీజన్ కావొచ్చురేప్ జరుగడానికి మినిస్కర్ట్ రీజన్ కాదు. అయితే కొన్ని సార్లు అది కారణం కావొచ్చు. ఉదాహరణకు మీరు హైదరాబాద్‌లో స్కర్ట్ ధరిస్తే ఎలాంటి సమస్య లేదు. కానీ విలేజ్‌లో ధరిస్తే దాని ప్రభావం మరోలా ఉండొచ్చు అని కొందరు అభిప్రాయ పడ్డారు.
ఊరంతా ఊర కుక్కలే ఉన్నాయి:‘‘ఊరంతా ఊర కుక్కలే ఉన్నాయి.. జాగ్రత్తగా ఉండమని చెబతాం. మనల్ని మనం రక్షించుకోవడం ముఖ్యం. అలాంటి వారికి దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. మీ లాంటి రిచ్ పీపుల్ సొంత కార్లు ఉంటాయి కాబట్టి సేప్‌గా వెళతారు. అందరికీ అలాంటి పరిస్థితి ఉండద కదా.” ఒక లేడీ కామెంట్ చేశారు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా రేష్మి వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.