ప్రస్తుతం తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ పరిస్థితి చెప్పాలంటే దాదాపు పదికిపైగా ఛానల్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి,కొన్ని ఫేమస్ చానల్స్ తప్ప.ఎన్నికల వరకు ఏదోలా బండి లాక్కొచ్చిన ఛానల్స్ ఇప్పుడు మూత దశలో ఉన్నాయి. కొన్ని ఛానల్స్ యాజమాన్యాలు అప్పుడే బేరాలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లో ఉన్న ఒక న్యూస్ ఛానల్ ఇప్పుడు అమ్మకానికి వచ్చేసింది.
👉ఆన్యూస్ ఛానల్ పేరు : రాజ్ న్యూస్ ,ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సంబందించిన న్యూస్ ఛానల్. టీ.పిసిసి అధ్యక్ష పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఆ అవకాశం రాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు. కోమటిరెడ్డి ఎంపీగా ఓడిపోతే ఐదేళ్ల వరకు చేసేదేమీ ఉండదు. ఇప్పటికే రాజ్ న్యూస్ ఛానల్‌పై కోట్లాది రూపాయిలు అనవసరంగా ఖర్చు చేశామన్న భావనతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు రాజ్ న్యూస్‌ను వదిలేశారు.
👉విజయసాయిరెడ్డి ప్రమేయం తో :
వైసిపి వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంటర్ అయి రాజ్ న్యూస్ ఛానల్‌ను టేకోవర్ చేయించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ప్రయత్నాలకు జగన్ సైతం ఓకే అనడంతో త్వరలోనే ‘సాక్షి ఛానెల్ -2″ మొదలు కాబోతున్నట్టు మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజ్ న్యూస్ పేరు మారుస్తారా ? లేదా అదే పేరు మార్చి కంటిన్యూ చేస్తారా ? అన్నది చూడాలి. 👉కొత్త ఛానెల్ ఎందుకంటే ; తమ వాదన బలపరుచుకోవడం కోసం,ప్రశ్నించడం కోసం. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాకా కొట్టటానికి ఇప్పటికే 10 ఛానళ్లు ఉన్నాయి. ఇంకా ఎన్ని వచ్చినా ఆయన కలిపేసుకుంటారు, అందులో సందేహం లేదు. చంద్రబాబును నిలదీయాలంటే వైసీపీకి మరో ఒకటి రెండు ఛానళ్లు అదనంగా ఉండటంలో తప్పులేదు.
ఏదేమైనా రాజ్ ఛానల్ రూపంలో మరో అదనపు ఛానల్ తోడవుతోంది. 👉రేపటి ఎన్నికల్లో ఫలితాలు వైసిపికి అనుకూలంగా వస్తే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ విధానాలు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇక ఎల్లో మీడియా ఛానెళ్లు చంద్రబాబుకు మామూలుగా వంత పాడవు. మరి ఈ భజనకు ఘాటైన కౌంటర్లు ఉండేందుకు ఇప్పుడు రాజ్ న్యూస్ ఛానెల్ వైసీపీ అండ్ కోకు మరో అదనపు బలం కాబోతుంది.అంటే త్వరలో మరొక సాక్షి లాంటి అస్త్రం రాబోతుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.