సల్మాన్.. భారత్ మూవీ రివ్యూ

Spread the love

భారత్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించిన సినిమా అని చెప్పవచ్చు. సల్మాన్ కెరీర్‌లో నిలిచి పోయే మరో సినిమా అనిచెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు.

🔴సల్మాన్ ఖాన్ : బాలీవుడ్‌లో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న సల్మాన్ ఖాన్ భజ్‌రంగీ భాయ్‌జాన్, సుల్తాన్ లాంటి ఎమోషనల్ సినిమాలతో నటుడిగా ప్రశంసలు పొందారు. 👉తాజాగా విలక్షణమైన, భావోద్వేగమైన కథతో, విభిన్నపాత్రలతో భారత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ్లామర్ పాత్రలకే పరిమితమైన కత్రినా కైఫ్ ఓ భావోద్వేగమైన పాత్రలో నటించారనే విషయం ప్రమోషన్ కార్యక్రమంలో వ్యక్తమైంది. భారత్ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆలరించిందా? సల్మాన్ ఖాన్ మళ్లీ బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాడా? కత్రినా కైఫ్ తన ప్రతిభతో ఆకట్టుకొన్నదా అనే ప్రశ్నలకు సమాధానమే భారత్.

🔴 స్టోరీ:

భారత్ (సల్మాన్ ఖాన్) దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు బయలుదేరుతారు. ఆ క్రమంలో తన తండ్రి (జాకీ ష్రాఫ్), చెల్లెలు గుడియా (టబు) జనరద్దీ తోపులాటలో తప్పిపోతారు. భారత్ తన తల్లి, చెల్లెలు, సోదరులతో ఢిల్లీకి తిరిగివస్తారు. పాకిస్థాన్ నుంచి బయలు దేరుతున్న సమయంలో తనకు ఏదైనా జరిగితే కుటుంబాన్ని చూసుకొనే బాధ్యత నీదే… ఏ క్షణంలోనైనా కుటుంబ బాధ్యతలు వదలిపెట్టకు అని చెబుతాడు. అలా తండ్రి, చెల్లెలు దూరమైన బాధతో బాల్యంలోనే కుటుంబ బాధ్యతను భుజానకెత్తు కొంటాడు.

👉ట్విస్ట్ లు:

కుటుంబ పోషణ కోసం సర్కస్‌లో బైక్ రైడర్‌గా, అలాగే కుటుంబ పోషణ కోసం గల్భ్‌లో చమురు బావిలో పనిచేసే వ్యక్తిగా, అలాగే నేవీలో ఉద్యోగిగా ఎందుకు మారాడు? తండ్రి చెప్పిన మాటలను తుచ తప్పకుండా పాటించాడా? తన జీవిత ప్రయాణంలో ఎదురైన కుముద్‌కు తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు? భారత్ ప్రేమను కుముద్ అంగీకరించిందా? తప్పిపోయిన తన తండ్రి, చెల్లెలు తిరిగి కలిశారా? అనే ప్రశ్నలకు సమాధానమే భారత్ సినిమా కథ.

🔴ఫస్టాఫ్ :

60 ఏళ్ల భారత్ జీవితంలో ఓ కీలకమైన, భావోద్వేగమైన అంశాన్ని టచ్ చేస్తూ కథ ప్రారంభమవుతుంది. తన మనసుకు, సెంటిమెంట్‌కు సంబంధించిన అంశాన్ని తన వద్ద నుంచి లాక్కోవడాన్ని ఎదురించడంతో కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తాడు. ఈ క్రమంలో తన జీవిత కథను చెప్పడం ప్రారంభిస్తాడు.

🔶అద్భుతమైన సన్నివేశాలు:

పాకిస్థాన్, భారత విభజన సమయంలో ప్రజలు పడిన కష్టాలు, తమ మూలాలను వెతుక్కుంటూ దేశానికి వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. భారత్‌లోని ఓ ముస్లిం అబ్బాయిని పాకిస్థాన్ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నకు ఇక్కడే పుట్టాం. ఇక్కడే చస్తాం అనే జవాబు ప్రేక్షకుడిని కదిలించేలా ఉంటుంది. తొలి భాగంలో కాస్త నింపాదిగా కథ చెప్పడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బందికి గురిచేసినట్టు అనిపించినా.. ఎమోషనల్ సీన్లు, కామెడీ ప్రేక్షకుడిని కథలో లీనం చేసేలా చేస్తుంది.

🔴సెకండాఫ్:

ఇక రెండో భాగంలో భారత్ కుటుంబాన్ని ఎదురయ్యే సమస్యలు, చెల్లెలి పెళ్లి, నేవీలో ఉండగా సముద్ర దొంగల దాడి లాంటి అంశాలు, ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ సాగుతుంది. ఇక చివర్లలో… విభజన సమయంలో పాకిస్థాన్, భారత్‌లో తప్పి పోయిన కుటుంబాలను కలిపి ఎపోసిడ్ సినిమాకు హైలెట్‌గా అనిచెప్పవచ్చు. సల్మాన్, టుబు నటన భావోద్వేగానికి గురిచేస్తుంది. అంతేకాకుండా కంటతడి పెట్టించేలా ఉంటుంది.

🔴దర్శకత్వం, టేకింగ్:

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రాసుకొన్న కథ, కథనాలే సినిమాకు ఆయువు పట్టు అని చెప్పవచ్చు. జాకీష్రాఫ్, సల్మాన్ ఖాన్ మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా మలిచిన తీరు హృదయానికి హత్తుకొన్నాయి. భారత్‌గా సల్మాన్ ఖాన్ జీవితంలో పలు దశలను, పాత్రలను తీర్చి దిద్దిన తీరు బాగుంది. సునీల్ గ్రోవర్ పాత్రను రాసుకొన్న విధానం సినిమాను వినోదాత్మకంగా మలిచింది. ఫ్యామిలీ సెంటిమెంట్, దేశభక్తి లాంటి అంశాలతో కథను అల్లుకొన్న తీరు మరీ బాగుంది. సినిమా రెండో భాగాన్ని తెరకెక్కించిన విధానం భజరంగీ భాయ్‌జాన్‌ను మళ్లీ గుర్తుకు తెచ్చింది.

🔴సల్మాన్ ఫెర్ఫార్మెన్స్:

నటుడిగా పరిణితి చెందుతున్నాడని చెప్పడానికి భారత్‌లో సల్మాన్ చేసిన పలు పాత్రలే నిదర్శనం. 1964లో సర్కస్‌లో స్టంట్ మాస్టర్‌గా, 1970లో మైనింగ్‌లో పనిచేసే కూలీగా, 1985లో నేవీలో పనిచేసే ఆఫీసర్‌గా, 1990లో వయసు మీద పడిన వ్యక్తిగా వివిధ గెటప్స్‌లో సల్మాన్ ఖాన్ తెర మీద మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. కత్రినాతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా వృద్ధుడి పాత్రలో సల్మాన్ ఒదిగిపోయాడు. వయసు మీద పడినప్పటికీ.. భార్యతో చేసే రొమాన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఉంది. ఈ సినిమాను సల్మాన్ వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు.

కత్రినా కైఫ్ యాక్టింగ్:

ఇప్పటివరకు కనిపించిన విధంగా కత్రినా కైఫ్ కుముద్ పాత్రలో మెప్పించారు. ఎమోషనల్‌గాను, గ్లామర్ గాను ఆకట్టుకొన్నది. యువతిగా, వృద్దురాలిగా రెండు రకాల షేడ్స్ ఉన్నా పాత్రలో కనిపించింది. వృద్ధురాలిగా ఇంకా మేకప్ విషయంలో శ్రద్ద తీసుకొని ఉండాల్సింది. కత్రినా పోషించిన కుముద్ పాత్ర కృత్రిమంగా కనిపించినా.. నటిగా ఆమె మరో మెట్టు ఎక్కినట్టు కనిపించింది.

👉ఫైనల్‌గా :

భారత, పాకిస్థాన్ విభజన సమయంలో ఆ దేశానికి చెందిన ప్రజలు ఇక్కడికి ఈ దేశానికి చెందిన ప్రజలు అక్కడికి వెళ్లే సమయంలో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితుల ఆధారంగా భారత్ సినిమా రూపొందింది. సల్మాన్ ఖాన్ నటన, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading