Teluguwonders:
కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్రకటించింది. చంద్రునిపై 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సాఫీగానే సాగింది. ఇక ల్యాండ్ అయ్యేందుకు నిమిషాల వ్యవధి మాత్రమే ఉందన్న తరుణంలో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ప్రకటించారు.
తెల్లవారితే శనివారం 1:38 గంటలకు ల్యాండర్ విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. కక్ష్య నుంచి చంద్రుడిపై దిగే ప్రక్రియ 1:48 గంటలకు ల్యాండర్ ఫైన్ బ్రేకింగ్ వరకూ రాగలిగాం. లోకల్ నావిగేషన్ అందుకోవడానికి ఇంకా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. కానీ, అనుకున్నట్లు జరగలేదు. పథకం ప్రకారం జరిగితే 1:52 గంటలకు ల్యాండర్ చంద్రుడి తొలి చిత్రాన్ని భూమికి పంపించి ఉండేది. మరునిమిషమే 1:53కి ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా దిగేది.
దిగాల్సిన చోటుకు 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ల్యాండర్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. అప్పటికే కొద్దిగా దిశ మార్చుకుంటున్నట్లుగా స్క్రీన్‌పై కనిపించింది. ఇస్రో శాస్త్రవేత్తల ఆందోళనపడ్డారు. ఆ తర్వాత కాసేపటికి ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినట్లుగా ఇస్రో చైర్మన్ ప్రకటించారు. డేటాను విశ్లేషిస్తున్నామని వివరించారు. రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసే విధంగా ప్లాన్ చేశారు. రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉంది.
ల్యాండింగ్ ప్రక్రియను ప్రధాని మోడీ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షించారు. సిగ్నల్స్ ఆగిపోయిన తర్వాత శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. శాస్త్రవేత్తలు సాధించిన విజయం చిన్నది కాదని కొనియాడారు. శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశారని అన్నారు. వారిని చూసి గర్విస్తున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.