A .p.లోవై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది.జనం జగన్ పైన నమ్మకంతోనే ఓట్లేశారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. గత 30 సంవత్సరాల ఎపి రాజకీయాల్లో ఈ స్థాయిలో ఏ పార్టీ ఇంతటి విజయాన్ని సాధించలేదు.
🎉30వ తేదీన ప్రమాణ స్వీకారం :
ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేదీన సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే విజయవాడలో అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి జగన్ ప్రమాణ స్వీకారం ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశాడనే వార్తలు షికారు చేస్తోంది.
16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి. 13 ఛార్జిషీట్లలో ప్రధాన నిందితుడుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టవచ్చో లేదో తేల్చాలని సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలని పిటిషన్లో ఆ వ్యక్తి కోరాడనీ, సాయంత్రానికి లేకుంటే రేపు ఉదయానికి ఈ కేసుపై వాదోపవాదాలు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఐతే ఇందులో ఎంత వాస్తవమున్నదో తెలియాల్సి వుంది. ఒకవేళ పిటీషన్ వేస్తే.. ఆ వ్యక్తి ఎవరో ఇంకా తెలియలేదు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.