మొన్నటి వరకు ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్న శాస్త్రవేత్తలు ,అవి ఇప్పుడు మనతో పాటే ఉంటున్నాయని షాకింగ్.న్యూస్. చెప్తున్నారు. విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు.
👽 ఏలియన్స్ : గ్రహంతరవాసులను సైన్స్ ఫిక్షన్ మూవీల్లో మాత్రమే చూశాం.. ఏలియన్స్ ఆకృతి ఎలా ఉంటుందో సరిగా తెలియదు. మనషులు మాత్రమే కాదు.. ఏలియన్స్ వంటి గ్రహంతరవాసులు కూడా ఉన్నారంటూ ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ భూమిపైకి రానున్నాయని కొందరు విశ్వసిస్తుంటే.. ఏలియన్స్ ఇప్పటికే భూమిపైకి వచ్చి సంచరిస్తున్నాయంటూ మరికొందరు విశ్వసిస్తున్నారు.
👽ఏలియన్స్ మనుషులతో కలిసి భూగ్రహంపై:
గ్రహంతరవాసులతో మానవజాతికి మేలు ఉందా ?
ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఏలియన్స్ మనుషులతోనే కలిసి భూగ్రహంపై జీవిస్తున్నాయా? అంటే అవును అంటున్నారు ఓ ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్. ఏలియన్స్ వల్ల మానవ జాతికి ఎంతవరకు ముప్పు వాటిల్లనుందో తెలియదు.
👽మానవ జాతిని రక్షించడానికి వచ్చిన ఏలియన్స్ :వాతావరణ పరిస్థితుల్లో కలిగే విపరీత మార్పుల కారణంగా మన జాతిని నశించిపోకుండా ఉండేందుకు రాబోయే విధ్వంసాన్ని ఆపేందుకు ఏలియన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.దాని గురించే భూమిపై మనుషులతో కలిసి ఏలియన్స్ సీక్రెట్ గా జీవిస్తున్నట్టు ఆయన చెబుతున్నారు.
👽ఏలియన్స్ కు సంబంధించిన ఓ బుక్ లో : ఈ ఏలియన్స్ కు సంబంధించి యాంగ్ చి ఓ బుక్ రాశారు.
ఆ బుక్ టైటిల్ ను ట్రాన్స్ లేట్ చేసి.. ‘ఏలియన్ విజిటేషన్స్ అండ్ ది ఎండ్ ఆఫ్ హ్యుమినిటీ’అనే పేరుతో పబ్లీష్ చేశారు. ఈ బుక్ ప్రకారం..
🔴ఏలియన్స్ లక్ష్యం: ఇప్పటికే ఏలియన్స్ మానవుల్లో సీక్రెట్ గా కలిసిపోయాయని, భవిష్యత్ లో భూమిపై జరుగబోయే విధ్వంసం నుంచి మానవ జాతిని రక్షించడానికి తమ వంశవృద్ధి కోసం ఏలియన్స్ ప్రయత్నిస్తున్నాయని ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. తన పుస్తకంలోని హైలెట్స్ ను ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఏలియన్స్ మనతో కలిసి రహస్యంగా జీవిస్తున్నాయని తాను గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపారు. .
🔴భవిష్యత్ లో మనుషులతో కలవబోతున్న ఏలియన్స్ :
గ్లోబల్ వార్మింగ్ ను అడ్డుకోని భవిష్యత్తులో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి .. ఏలియన్స్ అంతర వంశవృద్ధి ద్వారా ఏలియన్-హ్యుమన్ హైబ్రిడ్స్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అన్నారు. తద్వారా ఏలియన్స్ తమ స్మార్ట్ బేబీలతో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కార కర్తలు లేదా ప్రపంచ నేతలుగా తయారవుతాయని యాంగ్ చీ తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.