సైనికుడే దేవుడు.. జవాన్ల కాళ్లు మొక్కిన వరద బాధితురాలు.. వీడియో వైరల్

soldier is a God
Spread the love

Teluguwonders:

ఆపదలో చిక్కుకుపోయినప్పుడు మనల్ని రక్షించేవాడే దేవుడు. ఓ వరద బాధితురాలి విషయం లో.. ఓ సైనికుడు ఇలాగే దేవుడయ్యాడు.

🔴సోషల్ మీడియాలో వైరల్‌ అయిన వీడియో :

ఓ వరద బాధితురాలు తనను కాపాడిన సైనికుల కాళ్లు మొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైనికుడు వారిస్తున్నా ఆమె మాత్రం మనస్ఫూర్తిగా నమస్కరించింది. మన సైనికుల త్యాగాలకు ఈ వీడియో అద్దం పడుతోంది.

ఓ మహిళ వరదలో చిక్కుకుపోయిన తనను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న జవాన్లకు దండం పెట్టింది. నీటిలో చిక్కుకుపోయిన తమను కాపాడి, పడవలో పునరావాస కేంద్రాలకు తరలిస్తోన్న సైనికుల కాళ్లను తాకి మరీ మనస్ఫూర్తిగా నమస్కరించింది. దూరంగా ఉన్న సైనికులను చూస్తూ దండం పెట్టుకుంది. ఆ సమయంలో వేరే వ్యక్తులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

🔴వివరాల్లోకి వెళ్తే..:

కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కుండపోత వర్షాల కారణంగా వరదలు రావడంతో.. భారీ సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్రి జిల్లాల్లో పరిస్థితి మరీ భయానకంగా మారింది. కనుచూపు మేర ఎటు చూసినా వరద నీరే. గ్రామాలన్నీ చెరువులుగా మారిపోయాయి. రోడ్లు, రైల్వే ట్రాక్‌ల మీద నీరు ప్రవహిస్తోంది. దీంతో లక్షలాది మంది వరదల బారిన పడ్డారు.

👉 మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..:

వరదల్లో చిక్కుకుపోయిన కొల్హాపూర్ జిల్లా షిరోల్ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడం కోసం విశాఖపట్నం నుంచి ఇండియన్ నేవీ బృందాలు బయల్దేరాయని, శనివారం ఇక్కడికి చేరుకుంటాయని తెలిపారు. సంగ్లీలో 95 బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు.

ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బంది రేయింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వరద నీటిలో చిక్కుకపోయిన ఓ మహిళను జవాన్లు బోటు ఎక్కించగా.. వారికి ఆమె దండాలు పెడుతూ కాళ్లు మొక్కింది. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియోను సీఆర్పీఎఫ్ రీట్వీట్ చేసింది.

సైనికుల అనితర దేశ సేవ కు ఈ సంఘటన ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading