ముగ్గురమ్మల మూలపుటమ్మ..!!! ఎవరో..మీకు తెలుసా…??

sri matha
Spread the love

Teluguwonders:

హిందూ సంప్రదాయ ప్రకారం సృష్టి అంతటికీ కారణం ఆదిశక్తి అని అందరూ నమ్ముతారు. మరి పోతనగారు రచించిన ముగ్గురమ్మల మూలపుటమ్మ అనే పద్యంలో ముగ్గురమ్మలు ఎవరు ?వారి మూలపుటమ్మ ఎవరు? అనేది తెలుసుకుందాం!!!

✡ముగ్గురమ్మలు :

1⃣లక్ష్మీదేవి

సిరిసంపదలు, అదృష్టానికి ‘హేతువైన లక్ష్మీదేవికలువ పువ్వుల్ని రెండు చేతులతో పట్టుకుని వుంటుంది.కలువపువ్వు స్వచ్చతకు, పరిపూర్ణతకు, సంతానోత్పత్తికి
చిహ్నం. లక్ష్మీదేవిని “పద్మ”, కమల అంటారు. అందమైనదేవతగా ‘శ్రీ’ అని కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి పక్కన వుండేఐరావతం-విజ్ఞానానికి, రాచరికానికి చిహ్నంగా భావిస్తారు.

2⃣కాళికాదేవి :

నాలుగు చేతులతో, నల్లని రూపంతో భీకరఅవతారంతో వుంటుంది కాళికా అమ్మవారు. దుష్టశక్తుల్నివధించే కత్తి ఒక చేతిలో, దుష్టశక్తి తలను మరో చేత్తో
ధరించి వుంటుంది. మరో రెండు చేతులతో భక్తులకువరాల్ని, అభయాన్ని ఇస్తుంటుంది. మెడలో పుర్రెల దండఎర్రబారిన మూడు కన్నులు, బయటకు సాగిన నాలుకతోభీకర అవతారంలో వుంటుంది. ఇవన్నీ ఆమెలోని అపారత్వానికి, దుష్టశక్తుల వినాశనానికి చిహ్నాలు.

3⃣సరస్వతీదేవి :

చదువుల తల్లి సరస్వతీ దేవి పద్మంపైకూర్చుని, తెల్ల హంస పక్కన ఉంటుంది. దీనిని అందానికి,స్వచ్చతకు చిహ్నంగా భావిస్తారు. వీణను చేత ధరించి వేదాలు
పలికిస్తుంది. పుస్తకం, నీటి పాత్ర ఆమెవద్ద వుంటాయి.మతాచారాలకు, ఆధ్యాత్మికసంబంధిత ప్రక్రియలకు,విజ్ఞానానికి, విశ్వాసానికి ప్రతీక సరస్వతీదేవి. వీరే మనకు ముగ్గురమ్మలు…మరి మూలపుటమ్మా ఎవరంటే..!!

🕉ముగ్గురమ్మల మూలపుటమ్మ :

అమ్మలగన్నయమ్మ ఎవరు?అంటే మనకి లలితాసహస్రం ‘శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. శ్రీమాతా అంటే ‘శ’ కార, ‘ర’ కార, ‘ఈ’ కారముల చేత సత్వ, రజస్తమోగుణాధీశులైన శక్తి. బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి. సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి, ఈ ముగ్గురికీ అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఎవరో ఆ యమ్మ, అంటే, ‘లలితాపరాభట్టారికా’ స్వరూపం. ఈ అమ్మవారికి, దుర్గా స్వరూపమునకు బేధం లేదు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతులుగా కొలిచే దుర్గమ్మ ఆవిడ..

✡’చాలా పెద్దమ్మ‘:

అంటే మహాశక్తి అండపిండబ్రహ్మాండం అంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం. శక్తి స్వరూపం చిన్నా, పెద్దా బేధం లేకుండా సమస్త జీవులలోనిండిపోయినది. అలా ఉండడం అనేది మాతృత్వం.అవిడే సృష్టిఅంతటికీ ..అమ్మ ..మూలపుటమ్మా..


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading