రిటైర్ కాబోతున్న ఆ స్టార్ క్రికెటర్

dhoni
Spread the love

Teluguwonders: కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచ కప్‌ ఆడాలనేది ప్రతీ క్రికెటర్‌ కల. 2019 ప్రపంచకప్ లో భారత జట్టు చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తూ అందరి మనసులను గెలుపొందుతుంది. ఇందుకు గల కారణం కోహ్లీ నాయకత్వంలో ధోని మరియు జట్టు సమిష్టి ప్రదర్శన.అద్భుతం..అయితే

🔴ధోనీ రిటైర్మెంట్ నిజమేనా..??

సచిన్‌ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్‌లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్‌ ఉండీ ఒక్క టోర్నీ కూడా ఆడే అవకాశం దక్కనివారు
ఎందరో. అయితే కెరీర్‌ చివరి దశకు వచ్చిన సమయంలో ‘ఈ ఒక్కసారి’ అంటూ వరల్డ్‌ కప్‌ కోసం సర్వశక్తులు ఒడ్డి సిద్ధమయ్యే క్రికెటర్ల జాబితా కూడా పెద్దదే. ఆటగాళ్ల ఆలోచన, బోర్డు ప్రణాళికల్లో
కూడా ఆయా సీనియర్లు, వారి అనుభవానికి ఒక ఆఖరి అవకాశం ఇచ్చి సగౌరవంగా పంపించాలనే భావన కనిపిస్తుంది. అందుకే సహజంగానే ప్రతీ ప్రపంచ కప్‌ తర్వాత ఎందరో స్టార్ల కెరీర్‌లకు ఫుల్‌స్టాప్‌పడుతుంది. కొందరు విజయంతో సంతృప్తికరంగా గుడ్‌బై చెబితే, మరికొందరు నిరాశాజనకంగా ఆటను ముగించాల్సి వస్తుంది.

👉మహేంద్ర సింగ్‌ ధోని :
నాలుగున్నరేళ్ల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించినా… పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని ముద్ర కొనసాగింది. అయితే గత కొంత కాలంగా వరుస వైఫల్యాలు, అనంతరం అతని ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వరల్డ్‌ కప్‌లాంటి మెగా ఈవెంట్‌లో ధోని అనుభవం, వ్యూహాలు జట్టుకు ఎంత అవసరమో గుర్తించి సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఎలాగైనా వరల్డ్‌ కప్‌ వరకైతే కొనసాగించాలని భావించారు. కెప్టెన్‌ కోహ్లి పదే పదే మద్దతుగా నిలవడం కూడా కలిసొచ్చింది. భారత్‌ గెలవాలంటే ధోనిలాంటి సీనియర్‌ పాత్ర కూడా కీలకం కానుంది. అయితే పరోక్షంగా బోర్డు వర్గాల వ్యాఖ్యల్లో కూడా ధోనికిదే చివరి టోర్నీ అని చాలా సార్లు వినిపించింది టోర్నీ ఫలితం ఎలా ఉన్నా, 38 ఏళ్ల ధోని ఎలా ఆడినా అతనికి ఇదే ఆఖరి ఆట కావచ్చు.

🔴రికార్డు:

రెండు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఒకసారి జట్టును జగజ్జేతగా నిలపడంతో పాటు మరోసారి సెమీస్‌ చేర్చాడు. అతనికి ఇది వరుసగా నాలుగో ప్రపంచ కప్‌. 20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో 42.25 సగటుతో 507 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

👉అప్పట్లో యువి రిటైరమెంట్ అనుభవం : ఇలా ఉంటే 2011 వరల్డ్ కప్ హీరోలలో ఒకడైన యువి ఇటీవలే రిటైర్ ఐన సంగతి తెలిసిందే. అతను రిటైర్ అయినప్పుడు ;ఆ సందర్భంలో తీవ్ర భావోద్వేగంకు గురైన సంగతి తెలిసిందే.

🔴అభిమానుల కోరిక :
ఇపుడు ధోని వంతు, ప్రపంచకప్ తర్వాత ధోని రిటైర్ అవుతాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు, మరికొందరు నెక్స్ట్ వరల్డ్కప్ వరకు ఆడతాడని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ధోని అద్వర్యం లో కోహ్లీ భారత్ కు ఈ ప్రపంచకప్ లో టైటిల్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోని మరి కొన్నాలు భారత జట్టు తరపున ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు .


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading