కుప్పకూలిన స్టీవ్ స్మిత్.. క్రీజ్ లో..అసలు ఏం జరిగింది..?!!

Spread the love

Teluguwonders:

స్టీవ్‌స్మిత్ కుప్పకూలిపోతే … కనీసం జాలి కూడా చూపకుండా మైదానంలో నవ్వుతూ నిల్చుకున్న ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ .. పై నెటిజన్లు మండిపడుతున్నారు . నీకు మానవత్వం లేదా ఆంటూ తిట్టిపోస్తున్నారు.

స్టీవ్‌స్మిత్‌పైకి జోప్రా ఆర్చర్ వరుసగా బౌన్సర్లు సంధించడం తో స్మిత్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు.అయినా యాషెస్ తొలి టెస్టులో.. రెండు శతకాలతో మెరిపించాడు స్మిత్

🔴వివరాల్లోకి వెళ్తే :

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌‌లో సిసలైన ఆధిపత్య పోరు మొదలైంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పైకి వరుస బౌన్సర్లని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు సంధించగా.. ఓ బంతి అతని మెడకి బలంగా తాకింది. దీంతో.. నొప్పితో విలవిలలాడిపోయిన

స్టీవ్‌స్మిత్ క్రీజులోనే నేలకొరిగిపోయాడు. దీంతో.. మైదానంలోని ఇంగ్లాండ్ క్రికెటర్లు కొంత మంది అతడి చుట్టూ చేరి సపర్యలు చేసేందుకు ప్రయత్నించగా.. బౌలర్‌ జోప్రా ఆర్చర్ మాత్రం జోస్ బట్లర్‌తో కలిసి మైదానంలో హేళనగా నవ్వుతూ కనిపించాడు.

🔴ఆ 8 రన్స్ తేడా ని గెలిస్తే :

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 👉258 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుని 71/4తో నిలిచింది. ఈ దశలో సహనంతో క్రీజులో నిలిచిన స్టీవ్‌స్మిత్ (92: 161 బంతుల్లో 14×4) ఇంగ్లాండ్ బౌలర్లకి ఎదురునిలిచాడు. బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో జోప్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్‌వోక్స్, బెన్‌స్టోక్స్.. అతడ్ని ఇబ్బందిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ.. ఇన్నింగ్స్ 77వ ఓవర్‌లో జోప్రా ఆర్చర్ గంటకి 148.7 కిమీ వేగంతో విసిరిన బౌన్సర్ నేరుగా వెళ్లి స్టీవ్‌స్మిత్ మెడ భాగంలో తాకింది. దీంతో.. ఈ మాజీ కెప్టెన్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత జట్టు ఫిజియో సూచన మేరకు రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగిన స్మిత్.. ఆ తర్వాత ఒక వికెట్ పడగానే మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆఖరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 👉250 పరుగులకి ఆలౌటైంది.

💥దెబ్బ తగిలినా బ్యాట్ వదలని స్మిత్ :

మైదానంలోనే చికిత్స తీసుకున్న ఈ మాజీ కెప్టెన్ గాయం తోనే బ్యాటింగ్‌ని కొనసాగించాడు. 🔵 ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్‌ ఫిలిప్ హ్యూస్ బౌన్సర్ తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

👉ఆ హెల్మెట్‌ని వాడలేదు :

వాస్తవానికి ఫిలిప్ హ్యూస్ ఘటన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆటగాళ్ల భద్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. హెల్మట్లలోనూ మార్పులు చేసి.. మెడకి కూడా రక్షణగా నిలిచే హెల్మెట్లని తయారు చేయిస్తోంది. కానీ.. ఈ మ్యాచ్‌కి స్టీవ్‌స్మిత్ కొత్త తరహా హెల్మెట్‌ని వాడలేదు. ఈ మెడ గాయానికి కొద్దిసేపు ముందు కూడా ఆర్చర్ బౌలింగ్‌లో స్మిత్ ముంజేతికి గాయమైంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading