Latest

    Subham Movie Review: శుభం మూవీ రివ్యూ.. నిర్మాతగా సమంత ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..

    ఇన్నాళ్లు యాక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన మొదటి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్టుగానే శుభం అంతా శుభమే జరిగిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

    మూవీ రివ్యూ: శుభం

    నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు

    సంగీతం: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్

    సినిమాటోగ్రఫి: మృదుల్ సేన్

    ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల

    దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల

    నిర్మాత: సమంత రూత్ ప్రభు

    ఇన్నాళ్లు యాక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన మొదటి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్టుగానే శుభం అంతా శుభమే జరిగిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

    కథ:

    వైజాగ్ లోని భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్‌ శ్రీను (హర్షిత్ రెడ్డి), తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) సంతోషంగా జీవితం గడుపుతుంటారు. అందులో శీను మాత్రమే బ్యాచిలర్. మిగిలిన ఇద్దరికీ పెళ్లి అవుతుంది. వాళ్ల భార్యలు ఫరీదా, గాయత్రి (శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి). అదే సమయంలో శ్రీవల్లి (శ్రియా కొంతం)తో శీను పెళ్లి అవుతుంది. ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ తో లోపలికి వచ్చిన శ్రీవల్లి.. సీరియల్ టైం అవ్వగానే వెళ్లి టీవీ ముందుకు కూర్చుంటుంది. అదేంటని శీను అడగ్గానే దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. ఇదే విషయం తన స్నేహితులకు చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది అని వాళ్ళు కూడా చెప్తారు. కేవలం తమ ముగ్గురు ఇళ్లలో కాదు మొత్తం ఊర్లో ఆ సీరియల్ చూస్తున్న సమయంలో ఆడవాళ్లకు దయ్యం పట్టినట్టు నానా హంగామా చేస్తుంటారు. దాంతో పరిష్కారం కోసం అదే ఊర్లో ఉన్న మాత మాయ ( సమంత రుత్ ప్రభు)ను సలహా కోసం ఆశ్రయిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

    కథనం:

    ఆడవాళ్లకు సీరియల్స్ కు విడదీయడానికి అనుబంధం ఉంటుంది. సంవత్సరాలు పాటు ఆ సీరియల్స్ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళు. సరిగ్గా తన తొలి సినిమా కోసం అలాంటి కథను ఎంచుకుంది సమంత. సీరియల్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వచ్చేసాడు దర్శకుడు ప్రవీణ్. తొలి 15 నిమిషాల్లోనే హీరో పెళ్లి అయిపోతుంది. ఫస్ట్ నైట్ రోజు నుంచే కథలో వేగం పెంచేసాడు. హీరోయిన్ సీరియల్ చూస్తూ కూర్చోవడం.. వెంటనే దయ్యం పట్టడం.. ఆ తర్వాత వాళ్ళ స్నేహితుల ఇళ్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడం.. ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సీరియల్ లోని సన్నివేశాలు చూపిస్తూ బాగా నవ్వించాడు దర్శకుడు ప్రవీణ్.

     

    పంచ్ లైన్:

    ఓవరాల్ గా శుభం.. అంతా శుభమే.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading