సాధారణంగా మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఏమి కనపడదు. కానీ ఆ అమ్మాయి ఆలా కాదు.కళ్ళకు గంతలు కట్టుకుని కూడా ఎదురుగా ఉన్నది ఏంటో చెప్పేయ్యగలదు. ఆమె పేరు “యోగమాత”. శివుడికి మూడో కన్ను ఉన్నట్టే ఆమెకు కూడా మూడో కన్ను ఉంది అని అంటున్నారు. ఆమెను చూసిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు . నమ్మడం లేదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనల గురించి విన్నాకా మీకే అర్థం అవుతుంది.
👉ఒకసారి :యోగమాతను చుట్టూ ఉన్న జనంలో ఓ వ్యక్తి వద్దకు ఆమెను తీసుకెళ్లారు.
అనంతరం ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగారు. తన ఎదురుగా ఉన్న వ్యక్తి వేసుకున్న దుస్తులు ఏమిటి ? వాటి రంగు ఏది ? అతని మెడలో ఏముంది ? అతని శరీరంలో ఉన్న వ్యాధులు ఏమిటి ? అని అడిగారు. అందుకు ఆ బాలిక సరిగ్గా సమాధానాలు చెప్పేసింది. దీంతో చుట్టూ ఉన్నవారు అది చూసి షాక్ అయ్యారు. 👉మరోసారి : డోనట్స్ ఆకారంలో ఉండే కొన్ని రింగులను ఆమెకు ఇచ్చారు. వాటిని ఒక దానిపై ఒకటి పేరుస్తూ వాటి రంగులు చెప్పమన్నారు. అంతే ఆ బాలిక ఒక్కో రింగును పేర్చుతూ వాటి రంగును చెప్పేసింది. ఆ తరువాత ఆ బాలిక కళ్లకు గంతలు ఉండగానే ఓ వ్యక్తి పేపర్‌పై ఇంగ్లీష్ లో లవ్ (LOVE) అనే అక్షరాలను రాశాడు. అది ఏ పదమో చెప్పాలని ఆ బాలికను అడగ్గా ఆమె లవ్ అని టక్కున చెప్పేసింది.దీంతో మళ్లీ షాక్.
👉ఇది ఎలా సాధ్యం ;
ఆ బాలిక బెంగుళూరులో ఉన్న పరమహంస నిత్యానంద గురుకుల పాఠశాల విద్యార్థిని. ఆమె పేరు ‘మా యోగమాత’. ఆమె అక్కడ ‘సూపర్ నాచురల్ పవర్స్’ అనే అంశంలో శిక్షణ తీసుకుందట.ఆ శిక్షణ వలన ఆమె కళ్లకు గంతలు కట్టుకున్నా ఎదుటి వ్యక్తిని స్కాన్ చేస్తుందట. దీంతో అతని గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయట. ఎదుటి వ్యక్తి ఏ దుస్తులు వేసుకున్నాడు, వాటి రంగు ఏమిటి, అతను వేసుకున్న ఆభరణాలు ఏమిటి, అతని శరరీంలో ఉన్న వ్యాధులు.. తదితర వివరాలను ఆమె చెబుతుంది. అందుకు ఆమెకు తన శరీరంలో ఉన్న 3వ కన్ను సహాయం చేస్తుందట. అయితే కేవలం మా యోగమాత మాత్రమే కాదు, ఇతర బాలికలు, బాలురికి కూడా ఈమెలాగే శక్తులు ఉన్నాయట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.