Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team
ముంబై: భారత క్రికెట్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఫీల్డర్లు ఉన్నారు. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్-యువరాజ్ ది బెస్ట్ అనిపించుకోగా.. 2005లో వారికి జతగా సురేశ్ రైనా చేరాడు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో జట్టులోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ తమ ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మనీశ్ పాండే ఇలా చెప్పుకుంటు పోతే ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఫీల్డల్ల జాబితా పెద్దగానే ఉంటుంది. అయితే ఈ జాబితాలో రైనా ముందుంటాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మైదానంలో ఏ స్థానంలో అయినా… రైనా అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేస్తాడు.బ్యాట్స్‌మెన్ పసిగట్టి..
బ్యాట్స్‌మెన్ కదలికలను పసిగట్టి..
అయితే అలాంటి రైనా తన దృష్టిలో టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్ ఎవరనే విషయాన్ని తాజాగా వెల్లడించాడు. స్పోర్ట్స్ స్క్రీన్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన రైనా.. భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ అని తెలిపాడు. ”రహానే అద్భుతంగా క్యాచ్‌లు అందుకుంటాడు. అతనిలో ఓ విభిన్నమైన శక్తి ఉంది. అతని శరీరం అతను ఎలా చెబితే అలా కదులుతుంది. అతను అత్యుత్తమమైన స్లిప్ ఫీల్డర్, బ్యాట్స్‌మెన్ కదలికలను పసిగట్టి.. క్యాచ్‌లు అందుకొనేందుకు ఎదురుచూస్తుంటాడు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే.. బ్యాట్స్‌మెన్‌కు, స్లిప్ ఫీల్డర్‌కు మధ్య దూరం తక్కువ ఉంటుంది” అని రైనా తెలిపాడు.
బంగ్లాదేశ్ మాత్రం..
బంగ్లాదేశ్ సిరీస్‌లో మాత్రం..
ఇక రహానే ఉత్తమ స్లిప్ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో తెగ ఇబ్బందిపడ్డాడు. ముఖ్యంగా స్లిప్‌లో పలుమార్లు క్యాచ్‌లు చేజార్చాడు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా రహానే క్యాచ్‌లు జారవిడచడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కెప్టెన్ కోహ్లీ ఫీల్డింగ్ సెట్ చేసే ప్రతీసారి స్లిప్‌ను రహానేకే కేటాయిస్తాడు. అతన్ని మాత్రం అక్కడి నుంచి మార్చడు. అంతలా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. స్లిప్‌లో మాత్రం తరుచూ క్యాచ్‌లు చేజారుస్తుంటాడు.
రైనా నీళ్లు చల్లిన కరోనా..
రైనా ఆశలపై నీళ్లు చల్లిన కరోనా..
గతేడాది ఆగస్టులో మోకాలి గాయానికి నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇక లాక్‌డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో రైనా పాల్గొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఈ సీనియర్ క్రికెటర్ ఆశించాడు. కానీ కరోనా అతని ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుందో లేదోననే సందిగ్ధత నెలకొంది.
భారత్ తరఫున ..
భారత్ తరఫున చివరిసారిగా..
ఇప్పటి వరకు భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఎలాగైనా ఆ టోర్నీలో ఆడాలనే సంకల్పంతో ఉన్నాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.