కింగ్ నాగార్జున తన తదుపరి చిత్రం మన్మదుడు 2 చిత్రీకరణలో హ్యాపీ గా పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ పోర్చుగల్ లో మొదలై షెడ్యూల్ సమయం లో ముగిసింది. చాలా షూట్ ఈ షెడ్యూల్ లో పూర్తయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రొమాంటిక్ కింగ్ నాగార్జున ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అక్షర గౌడ తో కూడా రొమాన్స్ లో ఉన్నాడు .
💙మన్మధుడు : గతంలో నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మధుడు సినిమాని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో నాగార్జున ఆడవారు అంటే నచ్చని ఒక కంపెనీ బాస్ గా మరియు ఒక లవర్ బాయ్ గా రెండు షేడ్స్లో కనిపిస్తు ఎంటర్టైన్ చేశారు .ఈ సినిమాలో పాటలతోపాటు ప్రత్యేకంగా త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి. దీనిలో కామెడీ కూడా పీక్స్ లో ఉంటుంది .ఇంతలా ఎంటర్ టైన్ చేసిన మన్మధుడు సినిమా కి తాజాగా సీక్వెల్ రాబోతుంది .తాజాగా ఈ సీక్వెల్ లో కీర్తి సురేష్ కూడా ఒక కథానాయకిగా కనపడనుంది .
💚కీర్తి సురేష్ : నేను శైలజా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన కీర్తి సురేష్ తన అందంతో మరియు అభినయంతో అందర్నీ ఆకర్షించి మంచి మార్కులు కొట్టేసింది. మొన్న వచ్చిన మహానటి చిత్రంలో సావిత్రి గా తన అభిప్రాయాన్ని పూర్తి లెవల్లో చూపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
🔹హైదరాబాద్ షూట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ : కాగా మన్మదుడు 2
చిత్రంలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించగా, ఈరోజు సెట్లలో చేరారు. కీర్తి సురేష్ తన షూట్ ని ఏ విరామాలు లేకుండా పూర్తి చేసారు. ఈ వారాంతంలో చిత్రీకరణ పూర్తి చేస్తారు. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది కళ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న , మన్మదుడు 2 ఆగస్టు 29 న విడుదల కానుంది .
👉ప్రత్యేక పాత్ర లో సమంత : మన్మదుడులో ఒక ప్రత్యేక పాత్రలో సమంత కనిపించి మెరిపించనుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.