భారీ గా తగ్గిన Tata Sky: సెట్ టాప్ బాక్స్ ధరలు ..

Spread the love

ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్ తర్వాత డైరెక్ట్ టు హోమ్ ఇండస్ట్రీలో కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగింది. దీంతో డీటీహెచ్ కంపెనీలైన టాటాస్కై, డిష్‌టీవీ, డీ2హెచ్, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ లాంటి కంపెనీలన్నీ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

🎉కస్టమర్లకు ఆఫర్లమీద ఆఫర్లు :. కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ రిలీజైంది. తాజాగా 🎉టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల తగ్గుదల ; టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల్ని తగ్గించేసింది. కొత్తగా కొనేవారికి నాలుగు రకాల సెట్ టాప్ బాక్సుల్ని ఆఫర్ చేస్తోంది టాటా స్కై.

గతంలో టాటా స్కై ఎస్‌డీ సెట్ టాప్ బాక్సు ధర రూ.2,000 దగ్గర ప్రారంభమయ్యేది. ప్రస్తుతం రూ.1,499 ధర నుంచి ప్రారంభమవుతుంది. కొత్త కనెక్షన్‌కు ఎంచుకునే ప్యాకేజీని బట్టి ధర మారుతుంది. ఒకవేళ హెచ్‌డీ టీవీ అయితే Tata Sky HD STB తీసుకోవాలి. గతంలో 👉Tata Sky HD STB : ప్రారంభ ధర రూ.2,200 ఉండగా ప్రస్తుతం రూ.1,699 నుంచి ధర ప్రారంభం అవుతుంది. 👉Tata Sky+ HD సెట్ టాప్ బాక్సు : కాస్త ఎక్కువ స్పెసిఫికేషన్స్‌తో ఉంటుంది. . లైవ్ టీవీని పాజ్ చేయడంతో పాటు ఒకేసారి 3 ఛానెళ్లను రికార్డ్ చేయొచ్చు. దీని ధర రూ.9,300. 👉 Tata Sky 4K STB : దీని ధర రూ.6,400. రెండు సెట్ టాప్ బాక్సుల ధరల్ని తగ్గించిన టాటాస్కై, మరో రెండు బాక్సుల ధరల్ని అలాగే ఉంచింది.

👉నాలుగు టాటా స్కై సెట్ టాప్ బాక్సులను మీరు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లల్లో కూడా కొనొచ్చు. మీకు టాటా స్కై కొత్త కనెక్షన్ కావాలంటే ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading