Teluguwonders:
కేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.. కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి నిబంధనకు వేల రూపాయల జరిమానాలు విధిస్తుండడంతో వాహనదారులు ఖంగు తింటున్నారు..ఈ నేపథ్యంలోనే కొత్త ట్రాఫిక్ రూల్సును అమలు చేస్తున్న రాష్ట్రాలు ఒక్కో వాహనం పై వేలాది రుపాయాలు వేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా జరిమానాల రూపంలో కేవలం వారం రోజుల్లోనే సుమారు 72 లక్షల రుపాయలను బెంగళూరు నగర పోలీసులు వాహన దారులపై జరిమానాలు విధించి రికార్డ్ సృష్టించారు.
ఆర్ధిక మాంద్యంతో అల్లాడుతున్న రాష్ట్రాలు, ట్రాఫిక్ నిబంధనలు అడ్డం పెట్టుకుని ఆదాయాన్ని అర్జిస్తున్నారా అన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు హూటాహుటిన కేంద్రం తీసుకువచ్చిన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు మరో ఆలోచన లేకుండా అమల్లోకి తెచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహాన దారులు ఏ చిన్న నిబంధన అతిక్రమించిన వేల రుపాయలతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. నూతన చట్టంతో ట్రాక్టర్లు, ఆటోలు ఒకేటేమిటి టూ వీలర్‌పైనే కనీసం పదివేలకు మించకుండా జరిమానాలు విధిస్తున్న పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తోంది.
ఈనేపథ్యంలోనే బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం జరిమానాలు విధించడంతో రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త మోటారు చట్టం అమల్లోకి రావడంతో వెంటనే రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు ప్రజలపై భారీ జరిమానాలు విధించారు. వారం రోజుల్లోనే సుమారు 75 లక్షలకు పైగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహానదారులపై జరిమానాలు విధించినట్టు నగర పోలీసులు తెలిపారు. కాగా ఈ జరిమానాలను మొత్తం 6,813 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను రిజిస్టర్ చేసి వాహనదారుల వద్ద నుంచి అంత మొత్తాన్ని రాబట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ఉండటం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వన్‌వే రూట్‌లో రావడం తదితరాల నుంచి జరిమానాలు ఎక్కువగా వసూలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
ఇక బెంగళూర్‌లోని ఈ వసూళ్లపై మిశ్రమ స్పందన లభిస్తోంది. భారీ జరిమానల వల్ల ప్రజల్లో మార్పులు వస్తాయని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతుండగా ఇది ఎక్కువగా మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని మరికొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ట్రాఫిక్ పోలీసుల తీరుతో కూడ కొంత ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు వాహానాదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన చట్టాన్ని బీజేపీయోతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ తోపాటు తెలుగు రాష్ట్రాలు కూడ అమలు చేసేందుకు వెనకడుగు వేశాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.