ఇక మనిషి బ్రతికేది..30 ఏళ్ళు మాత్రమే అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్రేక్‌త్రూ నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రీస్టోరేషన్ (బీఎన్‌సీసీఆర్) సంస్థ వారు.
🔴2050నాటికి యుగాంతమే :రానున్న 30ఏళ్ల లో ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్తుంది. . అయితే మానవాళి మరెంతోకాలంపాటు మనుగడ సాగించలేదా? పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచ జనాభాలో 90 శాతం మంది రానున్న 30 ఏళ్లలోనే తుడిచిపెట్టుకుపోతారా? అంటే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తోందిఆ సంస్థ. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన వివిధ దేశాల ప్రభుత్వాలతో కూడిన ప్యానెల్ (ఐపీసీసీ) ఈ విషయంలో ఏమీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. .
👉బీఎన్‌సీసీఆర్ నివేదిక ప్రకారం..: వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయులు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయాయి. ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల భూమ్మీద ఉన్న 800 కోట్ల మంది మానవులకు తీవ్ర ప్రమాదం ఉంది.
🔴సముద్రమట్టాలు పెరిగిపోతాయి :
సగటున 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగినా.. సముద్రమట్టాలు 0.5 మిల్లీమీటర్ల మేర పెరుగుతాయని బీఎన్‌సీసీఆర్ నివేదికలో పేర్కొన్నారు. తద్వారా బంగ్లాదేశ్, అమెరికాలోని ఫ్లోరిడా మునిగిపోతాయని.. సముద్రతీర నగరాలైన షాంఘై, లాగోస్, ముంబై వంటివి చిత్తడిగా మారుతాయని వివరించారు. తద్వారా పర్యావరణ కాందిశీకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. అదే ఉష్ణోగ్రతలు సగటున 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే.. మనుష్య జనాభాలో 90 శాతం మేర తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి నుంచే దీని నివారణకు చర్యలు తీసుకోకపోతే.. పశ్చిమ ఆఫ్రికా, మధ్యప్రాచ్యాలకు చెందిన 100 కోట్ల మంది తమ ఆవాసాలను వీడి వలస వెళ్లాల్సి ఉంటుంది. క్రమంగా ఇతర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి నెలకొని మనుషులు అంతరించపోతారని బీఎన్‌సీసీఆర్ ఆందోళన వెలిబుచ్చింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.