అద్భుతం :స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కనిపించిన ఆ పాము..70 ఏళ్ళ కి మళ్లీ కనిపించింది….!!

Spread the love

ఎప్పుడో కనపడకుండా పోయిన బంధువు మళ్ళీ కనబడితే ఎలా ఉంటుంది.. చాలా ఆశ్చర్యంగా ,చాలా సంతోషంగా ఉంటుంది కదూ .మనిషి విషయంలో అయితే అది నిజమే .కానీ అది జంతువో లేక వేరే ప్రాణో అయితే ఆ ఎమోషన్ ధైర్యం ఉన్న వారికి ఒకలా, భయపడే వారికి ఒకలా ఉంటుంది .అది కూడా ఆ ప్రాణి సాధు జంతువా లేదా క్రూర జంతువా అనేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది . మేటర్ ఏంటంటే శాస్త్రవేత్తలకు చాలా ఏళ్ల తర్వాత ఒక అరుదైన ప్రాణి కనిపించింది .దానితో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

👉వివరాల్లోకి వెళితే : అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో చాలా ఏళ్ల తర్వాత ఒక అరుదైన జాతి పాము కనిపించింది. గతంలో కూడా ఓ నాలుగు పాములు కనిపించాయి..అలాగని గతం లో అంటే 5 ఏళ్ళు,10 ఏళ్ళు కాదు. ఏకంగా 70 ఏళ్ళు..

🔴 స్వాతంత్ర్య కాలం నాటి పాము : ఎప్పుడో 70 ఏళ్ళు..కు ముందుఎప్పుడో .. కనిపించిన ఓ అత్యంత అరుదైన పాము మళ్లీ ఇన్నాళ్లకు కనబడింది .అంటే అది స్వాతంత్ర్య కాలం నాటి పాము అన మాట .అందుకే ఆ పాము శాస్త్రవేత్తలను అమితానందానికి గురిచేస్తోంది.

🔴పిట్ వైపర్ :ఆ పాము పేరు పిట్ వైపర్ . ఈ పాము అత్యంత విషపూరితమైన పాము రకం .

🔴 ఆచూకీ ఇక్కడ దొరికింది :తాజాగా ఇన్నేళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో దీని ఆచూకీ దొరికింది. దాదాపు 70 ఏళ్ల కిందట ఇలాంటివి నాలుగింటిని భారత్ లో చూశారు. ఆ తర్వాత పిట్ వైపర్ భారత్ లో కనిపించడం ఇదే తొలిసారి.
అశోక్ కాప్టెన్ నేతృత్వంలోని సరీసృప పరిశోధకుల బృందం అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంఒలో పిట్ వైపర్ ను చూసి ఆనందంతో గంతులేసింది. 👉కాగా, ఈ పాము అరుణాచల్ ప్రదేశ్ లో లభ్యమయ్యినందు వల్ల దీనికి అరుణాచల్ ప్రదేశ్ పేరుమీదుగా ‘ట్రిమెరుసురస్ అరుణాచలెన్సిస్’ అని నామకరణం చేశారు.

🔴పిట్ వైపర్ లక్షణాలు: ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగుల కలయికతో స్థానిక చెట్ల రంగులతో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ పాము తన ఎదుట ఉన్న ఇతర జీవుల శరీరంలోని వేడిని గుర్తించడం ద్వారా వేట సాగిస్తుంది. వేడిని గుర్తించడానికి పిట్ వైపర్ శరీరంలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

🔴సంతానోత్పత్తి క్రమం తెలియట్లేదు :ఈ పిట్ వైపర్లు సంతానోత్పత్తి క్రమంలో గుడ్లు పెడతాయా? లేక నేరుగా పిల్లల్ని కంటాయా? అనే విషయంపై శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగించనున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading