Latest

    గురక(Snoring) సమస్యతో..బాధ పడుతున్నారా…అయితే ఇది చదవండి….

    snoring

    Teluguwonders: నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు.

    దీనికితోడు సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

    👉ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక(Snoring) సమస్యతో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. దాని వల్ల వారు గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి కారణమయ్యేది.. గురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది కొన్ని జబ్బులు రోగిని కాక ఇతరులను తీవ్రంగా వేధిస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది గురక సమస్య. గురక పెట్టేవారి పక్కన పడుకున్న వారు అనుభవించే వేదన అలాంటిదిలాంటిది కాదు. చూడడానికి చిన్న సమస్యలా అనిపించే ‘గురక’ ప్రాణాంతకమైంది. అంతటి ప్రమాదకరమైన గురకకు పరిష్కారమార్గాలు ఎన్నో ఉన్నాయి.

    🔴గురక(Snoring) నివారణ కు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు :

    గురక సమస్య నుండి తప్పించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యతో సతమతమయ్యేవారు రోజూ పడుకునేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా ఉంటుందట.. రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. రెండు టీస్పూన్ల పసుపు పొడిని గ్లాసు వేడి పాలలో కలిపి త్రాగినా గురక తగ్గుతుంది. అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు పీల్చితే గురక(Snoring) తగ్గిపోతుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వేడి చేసి రోజూ రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక(Snoring)నుండి ఉపశమనం పొందవచ్చు.

    👉ఆరోగ్యపరంగా ఇది సమస్య అయితే కుటుంబంలో కలతలకూ గురక కారణమవుతోంది. భర్త/భార్యకు గురక సమస్య ఉందన్న కారణంగా ఎన్నో జంటలు విడాకులు తీసుకున్న సందర్బాలున్నాయి.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading