Teluguwonders:
చోడవరం:
స్థానిక ఏడమ్స్ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చోడవరానికి చెందిన కేత తేజ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను ఓ క్రమంలో నిమిషం 5 సెకన్లలో వేశాడు. అతితక్కువ సమయంలో ఆవర్తన పట్టికను వేయడంలో తేజ ఈ ఘనతను సాధించినట్లు ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త రంగారావు ప్రకటించారు. శనివారం ఏడమ్స్‌స్కూల్‌లో అధికారులు, పలువురు గ్రామప్రముఖుల సమక్షంలో తేజ ఆవర్తన పట్టిక వేసే క్రమాన్ని నిర్వహించారు. గతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన తరుణ్ అగర్వాల్ అనే విద్యార్థి ఆవర్తన పట్టికను 1ని.29సె. వేసి ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు ఆయన తెలిపారు.
తాజాగా తేజా ఈ రికార్డును 1ని.5సె. వేసి అధిగమించాడని తెలిపారు. ఇది ప్రపంచ రికార్డుగా నమోదైందని ఆయన వెల్లడించారు. తేజకు ప్రపంచ రికార్డు ధ్రువపత్రం, బంగారు పతకాన్ని అందజేశారు. పలువురు తేజను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వీ టీం ఛైర్మన్ విఎస్ వీరేంద్రబాబు(వీరూమామా), అటవీ శాఖ అధికారి రామ్‌రమేశ్, ఏడమ్స్ స్కూల్ సంచాలకులు బి.వెంకటరావు, విశ్రాంత అధ్యాపకుడు ఎన్ దేముడు పాల్గొన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.