Teluguwonders:
ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచింన తిరుమల గిరులపై ప్రముఖ స్వామిజీ శ్రీశ్రీశ్రీ త్రిడండి చిన జీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల గిరులు పవిత్రత తగ్గిపోయి ఒక క్లబ్‌లా తయారైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమలను పాలించే అధికారులు పవిత్రతను మంటగలుపుతున్నారని ఆయన మండిపడ్డారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే శ్రీవేంకటేశ్వరుని సన్నిధిని అధికారులో వ్యాహార కేంద్రాలుగా మార్చివేశారని ఆయన పేర్కొన్నారు. స్పష్టంగా చెప్పాలంటే తిరుమల పవిత్రత పోయి ఒక క్లబ్‌గా మారిపోయిందన్నారు. భక్తి పేరుతో కొండపైకి వచ్చే కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. అందుకే తిరుమల పవిత్రత పోయిందన్నారు. ఇలా గతంలో ఆయన చెప్పినట్టే తిరుమలలో ఒక సంఘటన జరిగింది.
🔴గుట్కాతో తిరుమలకు తమిళ తంబీలు:
గుట్కాతో తిరుమల లోనిఅలిపిరి తనిఖీ కేంద్రం వద్దకువచ్చిన కొంతమంది భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
👉వివరాల్లోకి వెళ్తే : తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టుకు చెందిన 45 మంది భక్త బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద లగేజ్ చెక్ చేస్తుండగా నారాయణస్వామి అనే భక్తుడు గుట్కా ప్యాకెట్‌ను చేతిలో పట్టుకున్నాడు.
సెక్యూరిటీ సిబ్బంది గుట్కా తీసుకెళ్ళకూడదని చెప్పి కిందపడేయమన్నారు. నారాయణ స్వామి గుట్కా ప్యాకెట్‌ను కిందపడేసి లగేజ్‌ను చెక్ చేయించుకుని వెనక్కి వచ్చి మళ్ళీ గుట్కా ప్యాకెట్‌ను ఎత్తుకున్నాడు.
🔴సెక్యూరిటీ సిబ్బంది కి చిర్రెత్తింది : దీంతో సెక్యూరిటీ సిబ్బంది కి చిర్రెత్తి నారాయణస్వామి చేతిలో ఉన్న గుట్కాప్యాకెట్‌ను బలవంతంగా తీసుకున్నారు. .
🔴సెక్యూరిటీ సిబ్బంది దాడి :
నారాయణస్వామి గుట్కా ప్యాకెట్ ఇవ్వకుండా సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగడంతో సెక్యూరిటీ సిబ్బందికి , భక్త బృందానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది నారాయణస్వామిపై దాడి చేశారు.నారాయణస్వామిని బలవంతంగా లాక్కెళ్ళి సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు.అడ్డొచ్చిన భక్తబృందాన్ని కొట్టారు.ఆ విధంగా అలిపురి లో చిన్న గుట్కా..ప్యాకెట్ పెద్ద గలాటని సృష్టించింది ..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.