మన పండుగ(festivals)లకు అసలు అర్థం తెలుసుకుందామా..

Hindu Festivals
Spread the love

Teluguwonders:

నిత్య జీవితంలో మనం అనేక రకాలైన పండుగలు జరుపుకుంటాం కానీ ఆ పండగలు ఎందుకు జరుపు కుంటున్నాం అనేది కొంతమందికి కొంతవరకు తెలుసు గాని , చాలా మందికి పూర్తిగా తెలియదు . ఐతే ఇప్పుడు మన పండుగల గొప్పతనం,అర్థం గురించి తెలుసుకుందాం …

✡ఉగాది : కష్టం.. సుఖమ్, సంతోషము, బాధ. ఇలాన్నంటినీ సమానంగా స్వీకరించాలి అని మన తొలి పండుగ ఉగాది మనకు చెపుతుంది.

✡శ్రీ రామనవమి : భార్యాభర్తల అనుబంధాన్ని ,అన్ని బంధాల లోని గొప్పతనాన్ని గొప్ప గా చెప్పుకోవడానికే శ్రీ రామనవమి .

✡అక్షయ తృతీయ : విలువైన వాటిని (బంగారాన్నే కాదు బంధాలని కూడా)కూడ బెట్టుకోవాలని నేర్పేది అక్షయ తృతీయ.

✡తొలి(పెద్ద) ఏకాదశి : ఉపవాసం ఉండాలని చెపుతూనే ఇష్టమైన పిండి వంటలు చేసుకుతినాలని చెప్తుంది.

✡వ్యాస (గురు) పౌర్ణమి : జ్ఞానాన్ని అందించిన గురువును మారువకూడదని …

✡నాగులచవితి : ప్రాణాలు తీసేదైనా(శత్రువు నైనా )సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని..

✡వరలక్ష్మి వ్రతం :
మీ కున్న ఐశ్వర్యం అందరికీ పెంచుతూ అందరితో కలిసి పోయి సంతోషము గా ఉండమని ..

✡రాఖీ పౌర్ణమి : తోడబుట్టిన బంధం ఎన్నటికి వీడకూడదని..

✡వినాయక చవితి (నవరాత్రులు) : ఊరంతా ఒక్కటిగా కలవడానికి…

✡పేతురు అమావాస్య : చనిపోయిన వారిని మరువకని చెప్పుతూ…

✡బతుకమ్మ : ఊళ్ళోని వారంతా ఆటపాటలుతో కలిసి సంతోషంగా గడపమని..

✡దసరా (ఆయుధ పూజ) :
ఎప్పుడు మీకు అండగా నిలిచి, నీ పనులు చేసే వాటిని గౌరవించు అని తెలపడానికి..

✡ధన త్రయోదశి : ధనం ఎప్పుడూ నిల్వయుండాలని..

✡దీపావళి : పది మందికి వెలుగు పంచే విధంగా జీవనం నడవాలని…

✡కేదారేశ్వర వ్రతం : ఎక్కడెక్కడో ఉన్న కుటుంబమంతా ఒక్కటిగా చేరి ఆనందించాలని..

✡కార్తీక పౌర్ణమి :
చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలవమని …

✡సంక్రాంతి :
మనం జీవించి ఉన్నాం అంటే కారణం వ్యవసాయం, అలాంటి దాన్ని
మరువకుండా సంబరాలు జరుపమని…

✡మహాశివరాత్రి : కాలం మారుతుంది శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలని..

✡కామదహనం : కోరికలను దహించమని…

💚హోలి : వివిధ రంగుల వలే ఉన్న.. వివిధ మనుషులు, వివిధ అనుభూతులను
పిల్ల పెద్ద అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని..హోళీ పండుగ చెప్తున్నాయి…అర్థం చేసుకుని చేసుకుంటే పండుగలు..మరింత సంతృప్తిగా ఉంటాయి…సంతోషంగా ఉంటాయి…


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading