Teluguwonders: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ నిన్న ఆదివారం ఎంతో ఉద్విగ్నభరితంగా జరిగింది .దేశ విజయకాంక్ష కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని కలలు కన్న కోట్ల మంది భారతీయుల కళ్ళల్లో నిన్న ఒక్కసారిగా వెలుగులు నిండాయి. ప్రపంచకప్ క్రికెట్ లో పాకిస్థాన్‌పై ఎన్నడూ ఓటమిని చవిచూడని భారత్ ఈ సారి కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంది.
🔰(మళ్ళీ )సత్తా చాటిన భారత్ : ఆదివారం ప్రపంచకప్ పోటీల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో పాక్.. భారత్ చేతిలో ఘోరపరాభవాన్ని చవిచూసింది. పలుమార్లు వర్షం వల్ల ఆటంకం కలగడంతో.. ఎంపైర్లు ఆటను 40 ఓవర్లకు కుదించారు.
🔴మొదట్లో భయపెట్టిన పాక్ :
.. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్ అద్భత సెంచరీకి తోడు శిఖర్ ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ మంచి బ్యాటింగ్ తో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ కు భారీ స్కోరు ఇచ్చింది. భారీ టార్గెట్ ఛేదించేద్దామని బరిలోకి దిగిన పాక్ మొదట్లో కాస్త భయపెట్టినా తర్వాత తర్వాత అంతగా రాణించలేకపోయింది. భారత బౌలర్ల విజృంభణతో టపటపా వికెట్లు కోల్పోయి 89 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
అయితే 13 పరుగుల వద్ద ఇమాముల్ హక్ (7) రూపంలో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. 24 ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. అద్భుత బంతితో బాబర్ ఆజం(48)ను బౌల్డ్ చేయడంతో టీమిండియాలో ఆశలు మొలకెత్తాయి. తర్వాతి ఓవర్‌లో ప్రమాదకర ఆటగాడు ఫకర్ జమాన్ (62)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత పాండ్యా వరుస బంతుల్లో హఫీజ్ (9), షోయబ్ మాలిక్(0)లను పెవిలియన్ పంపడంతో పాక్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సర్ఫరాజ్ కూడా (12) చేతులెత్తేశాడు.
🔴వర్షం దెబ్బకి : ఈ క్రమంలో 35 ఓవర్లలో 166/6తో పరాజయానికి పాక్ దగ్గరగా ఉన్న సమయంలో వర్షం మొదలైంది. దాదాపు గంటకుపైగా మ్యాచ్ నిలిచిపోయింది. పాక్ విజయ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు.
🔴వర్షం తగ్గాక : వర్షం కుడుటపడిన తర్వాత తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఐదు ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 46 పరుగులు మాత్రమే చేసి భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 👉ఈ విజయంతో భారత్ వరుసగా 7వ సారి ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.