Latest

    వడగాళ్ల వర్షం కాదు..అక్కడికి వెళ్తే వజ్రాల వర్షం కురుస్తుంది…

    భూమిపై వాతావరణం ( వరద, కరవు, వేడి, చలి)ఒక్కోసారి తీవ్రం గా, ఒక్కోసారి సాధారణం గ ఉంటుంది . ఇలా వాతావరణం లోని వ్యత్యాసం మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటుంది.

    వాతావరణం సరిగా ఉండడం, లేకపోవడం అనేది మన గ్రహంపైనే కాదు, వేరే గ్రహాలకు కూడా ఉంటుంది. సౌరమండలంలోని మిగతా గ్రహాలకు కూడా తమకంటూ ప్రత్యేక వాతావరణం ఉంటుంది.

    అంతరిక్షంలో వాతావరణం మనం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది.

    టామ్ లాడెన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త వార్విక్ యూనివర్సిటీలో గ్రహాల వాతావరణంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇతర గ్రహాల్లో ఉన్న వాతావరణం, పరిస్థితుల గురించి అధ్యయనం చేయడం ఆయన పని
    🌖భూమి లాంటి గ్రహం :
    “భూమి కాకుండా ఈ సౌర వ్యవస్థలో మనిషి జీవించడానికి తగిన వాతావరణం ఉన్న గ్రహం ఉందంటే, అది శుక్రగ్రహం పైనున్న వాతావరణమే”అని లాడెన్ అంటారు.

    అక్కడ ఒత్తిడి దాదాపు మన గ్రహంలాగే ఉంటుంది” అన్నారు.

    “మనం ఆ వాతావరణంలో ఊపిరి తీసుకోలేం. కానీ మనం ఒక పెద్ద హాట్ ఎయిర్ బెలూన్ లేదా గాలితో నిండిన ఏదైనా వస్తువులో ఉన్నట్టు ఊహించుకోవచ్చు. మీ దగ్గర ఆక్సిజన్ మాస్క్ ఉంటే, టీషర్ట్, షార్ట్ వేసుకుని అక్కడ హాయిగా ఉండచ్చు” అంటారు లాడెన్.”అక్కడ ఉష్ణోగ్రత కూడా మన భూమిపై ఒక గదిలో ఉన్న ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది. అంటే మనం ఆక్సిజన్ మాస్క్ వేసుకుంటే, ఎలాంటి ప్రమాదం లేకుండా శుక్రగ్రహం పైన పర్యటించి రావచ్చు.మరి ఇదే కాక వజ్రాల వర్షం పడే గ్రహం కూడా ఒకటి ఉందట .

    🌖వజ్రాల వర్షం పడే గ్రహం:

    సౌర కుటుంబానికి మరోవైపు వాయువులతో ఏర్పడిన రెండు విశాలమైన గ్రహాలు ఉన్నాయి. అవే యురేనస్, నెప్ట్యూన్.
    🌖నెప్ట్యూన్:
    నెప్ట్యూన్ భూమికి అత్యంత దూరంలో ఉంది. అక్కడ వాతావరణం సున్నా నుంచి మైనస్ 200 డిగ్రీల వరకూ ఉంటుంది.

    ఇక్కడ పేరుకుపోయిన మీథేన్ మేఘాలు ఎగురుతుంటాయి. ఇక్కడ సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల కంటే తీవ్రంగా పెను గాలులు వీస్తుంటాయి.

    నెప్ట్యూన్ ఉపరితలం దాదాపు పూర్తిగా సమతలంగా ఉంటుంది. ఇక్కడ మీథేన్ సూపర్‌సానిక్ గాలులు అడ్డుకునేలా పర్వతాల్లాంటివి ఏవీ ఉండవు. అందుకే వాటి వేగం 2400 కిలోమీటర్ల వరకూ చేరుతుంది.

    నెప్ట్యూన్ వాతావరణంలో గడ్డకట్టిన కార్బన్ ఉండడం వల్ల మీరు అక్కడికి వెళ్తే వజ్రాల వర్షంలో తడవ వచ్చు.
    👉కానీ మీపై పడుతున్న ఆ అమూల్యమైన రాళ్ల వల్ల గాయాలవుతాయేమో అని మీరు ఏమాత్రం కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే అక్కడున్న తీవ్రమైన చలి వల్ల మీరు అప్పటికే రాయిలా గడ్డకట్టుకుపోతారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading