మీకు తెలుసా…నిమ్మ చేసే మేలు అమ్మ కూడా చేయదట…
ఔను.మన శరీర ఆరోగ్యానికి నిమ్మకాయ చేసే మేలు ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
🍋నిమ్మ ఉపయోగాలు :పరగడుపునే నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి మేలు 👉ఇకసమ్మర్ లో కాస్త సబ్జాలు లేదా పంచదార వేసుకుని తాగితే శరీరంలో వేడి తో పాటు కొవ్వు కూడా తగ్గిపోతుంది .
🍋బానపొట్ట తగ్గటానికి : సబ్జా నిమ్మకాయ నీరు కలిపి తాగితే బానపొట్ట కూడా ఇట్టే కరిగిపోతుంది. 👉ఇక తేనే నిమ్మరసం తాగినా చాలా మంచిది శరీరానికి.
🍋వ్యాధినిరోధక వ్యవస్థ మెరుగు కోసం : ముఖ్యంగా జలుబు ఉన్న వారూ ,ఆరోగ్యం బాగాలేని వారు ఇది తీసుకుంటే యాక్టీవ్ అవుతారు.ఇందులో ఎక్కువ శాతం ఉండే విటమిన్ సి, వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
🍋అధిక రక్తపోటు తగ్గడానికి: ప్రతిరోజూ క్రమం తప్పక ఒక నిమ్మకాయ తీసుకుంటే అధిక రక్తపోటు 10% మేరకు తగ్గుతుంది.
🍋పొటాషియం కోసం :రోజంతటికీ సరిపడా పొటాషియం అందాలంటే రోజుకొక నిమ్మ కాయ తీసుకోవాలి. ఇది పచ్చళ్ల రూపంలో కంటే నేరుగా రసంగా తీసుకుంటే మంచిది.
🍋జీర్ణశక్తి కోసం :గ్లాసుడు నీళ్లలో ఒక నిమ్మకాయ పిండుకుని తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా జీర్ణశక్తి మెరుగవుతుంది. శరీరంలో ఉన్న మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.
🍋కొవ్వు రాకుండా: బయట తిండి తిన్నా కొవ్వు పట్టకుండా నిమ్మ ఆపుతుంది, మనిషి నీరసపడకుండా తక్షణ ఎనర్జీ ఇస్తుంది. 👉అందుకే వయసు బాగా ముదురుతున్న వారు ఇది అలవాటు చేసుకుంటారు. అందుకే చిన్నతనం నుంచి చేసుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల మన శరీరానికి నిమ్మ ఎంతో మేలు చేస్తుంది..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.