హిట్టొస్తే నెత్తిన పెట్టుకోవడం.. ఫ్లాపొస్తే దించేయడం సినీ ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా చూసేదే..ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ సహజం.. భారీ బ్లాక్ బస్టర్ ని ఇచ్చినప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేసిన అదే జనం అతడు పతనం అయినప్పుడు అయిపోయాడుగా అన్నారు..అతనే విజయ్ ఆంథోని ,ఆటను ఒక హీరో.. సంగీత దర్శకుడు.. ఎడిటర్.. నిర్మాత..అస్సలు అతడిలో లేని క్వాలిటీనే లేదు. ఆల్ రౌండర్ నైపుణ్యంతో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని.
🎊బిచ్చగాడు సినిమాతో ఆకాశమంత ఇమేజ్ :
ఓ స్ట్రెయిట్ హీరోలా బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు ఫ్లాపవ్వడంతో కెరియర్ పరంగా ఇబ్బందులు తప్పలేదు.
🔴సొంత సినిమాలు తీయడం లేదు: మార్కెట్ డౌన్ ఫాల్ అవ్వడంతో సొంత బ్యానర్ లో సినిమాల నిర్మాణం ఆపేశారు. అయితే ఈ విషయాల్ని ఓపెన్ గా అంగీకరించేందుకు ఎలాంటి భేషజానికి పోలేదు అతడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం.. డౌన్ టు ఎర్త్ ఉండడం అతడికి తొలి నుంచి అలవాటైన పద్ధతి. అందుకే విజయ్ ఆంటోనికి ప్రత్యేకించి ఫాలోవర్స్ ఉన్నారు.
🔴అర్జున్ తో కలిసి కిల్లర్ గా : ప్రస్తుతం విజయ్ నటించిన `కిల్లర్` తెలుగులో రిలీజవుతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. జూన్ 7 న తెలుగు – తమిళంలో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు.
👉కిల్లర్ ఎలా ఉండబోతుంది .?ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో ముచ్చటిస్తూ విజయ్ పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ-“సెల్ఫ్ పర్పస్ కోసం ఓ సీరియల్ కిల్లర్ ఏం చేశాడు? అన్నదే సినిమా. కిల్లర్ పాత్రలో నటించాను. అతడిని వెంటాడే సిన్సియర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అర్జున్ నటించారు. ఒక లెజెండరీ నటుడితో నటించిన ఆనందం నాకు ఉంది. ఈ సినిమా ఓ గ్రిప్పింగ్ థ్రిల్లర్. నెక్ట్స్ ఏం జరుగుతుందో ముందే చెప్పలేరు. సీటు అంచున కూచుని చూస్తారు. ఒక డెబ్యూ దర్శకుడు అయినా ఆండ్రూ లూయీస్ అద్భుతంగా తెరకెక్కించారు“ అని తెలిపారు.
9 సినిమాలు సొంత బ్యానర్ లో చేశాను. పదో సినిమా కిల్లర్ బయటి బ్యానర్ లో చేశాను. ఇకపైనా ఇతర బ్యానర్లలోనే చేస్తున్నా. 10 సినిమాలు క్యూలో ఉన్నాయి. అన్నీ బయటి నిర్మాణ సంస్థల్లో చేస్తున్నవేనని తెలిపారు. ఖాకీ .. జ్వాల అనే చిత్రాల్లోనూ నటిస్తున్నాని వెల్లడించారు. కొన్నాళ్ల పాటు పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తున్నానని.. మ్యూజిక్ కూడా చేయడం లేదని తెలిపారు. కిల్లర్ చిత్రానికి వేరొక సంగీత దర్శకుడు పని చేశారు. అతడు అద్భుతమైన రీరికార్డింగ్.. రెండుపాటల్ని కంపోజ్ చేశాడని తెలిపారు. నా పనైపోయింది అన్నవాళ్లే 10 సినిమాలు చేస్తున్నాను అనగానే సర్ ప్రైజ్ అయ్యారు. సినీమాయా ప్రపంచంలో ఇవన్నీ చాలా కామన్..అంటున్నారు విజయ్ ఆంథోని.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.