వేల కోట్లు ఎగవేసిన దొంగ..దర్జాగా వరల్డ్ కప్ చూడ్డానికి వచ్చాడు..అవును ఇది నిజం కానీ ఆ దొంగ కాస్ట్లీ ఘరానా దోంగ..
🔴విజయ్ మాల్యా : విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేశాడని అంచనా. బ్యాంకుల్ని వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి అయిన విజయ్ మాల్యా… ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి మీడియా కంటికి చిక్కాడు.
విజయ్ మాల్యా ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్… స్టేడియంలో ప్రత్యక్షం అయ్యాడు.
🔴వివరాల్లోకి వెళ్తే :ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుండటంతో ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు విజయ్ మాల్యా వచ్చాడు. స్టేడియం బయట ఉన్న ఏఎన్ఐ రిపోర్టర్ ‘అప్పగింత కేసు’ గురించి ప్రశ్నించడంతో… ‘నేను మ్యాచ్ చూడటానికి ఇక్కడికి వచ్చాను’ అని విజయ్ మాల్యా సమాధానం ఇచ్చాడు.
🔴మాల్యాను రప్పించేందుకు భారత్ ప్రయత్నం : ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రవేసుకున్న విజయ్ మాల్యాను రప్పించేందుకు భారతదేశం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇండియా ఇంత ప్రయత్నిస్తుంటే విజయ్ మాల్యా మాత్రం లండన్‌లో తిష్టవేసుకుని సరదాగా ఏమి తెలియని సాధారణ వ్యక్తి లా.. క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.విజయ్ మాల్యా అప్పగింత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. విజయ్ మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి.
🎤విజయ్ మాల్యా వెర్షన్ : తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు.భారతీయ జైళ్లు సురక్షితం కావని కోర్టులో ఆయన తనవాదన వినిపిస్తూ పోరాడుతున్నాడు. కాగా లండన్ హై కోర్టులో జూలై 2న ఆయన కేసు విచారణ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఒకటే అర్థమౌతుంది. సాగే పద్ధతి ఉండాలి కానీ “ఎంత దొంగ అయినా దొరే ” అని.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.