TeluguWonders
🔴ఈ సొసైటీకి ఏమైంది..!!? ఎక్కడ చూసినా మోసాలు, హత్యలు, అత్యాచారాలు ,ప్రేమ దాడులు ఇవే కనిపిస్తున్నాయి .సభ్య సమాజం అంటే ఇదేనా అనిపిస్తుంది .స్వార్థం, క్షణికావేశం ,సుఖాలకి అలవాటుపడి పోవడం… ఇవే ఇన్ని దారుణాలు కి అసలు కారణాలు. ఇప్పుడు చాలామంది సొసైటీలో ఇవే లక్షణాలతో కనిపిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే వీళ్ళు ఎవరు తప్పు చేయడానికి భయపడట్లేదు .అలాగే వీరికి ప్రభుత్వం వేసే శిక్ష కూడా తప్పట్లేదు . ఈ దారుణాలు ఢిల్లీలోనే కాదు ,మనం ఉండే గల్లీ లో కూడా జరుగుతున్నాయి. మనం ఇప్పటివరకు ప్రేమించలేదు అంటే దాడులు చేసే మగవాళ్ళని మాత్రమే చూసాము .కానీ తనను ప్రేమించడం లేదని ప్రియున్ని చంపడానికి ప్రయత్నించిన ఆడవాళ్ళను చూసామా..!!! లేదు కదా
🔴విషయంలోకి వెళితే తనను ప్రేమించడం లేదని తన ప్రియుణ్ణి చంపడానికి ప్రయత్నించింది ఒక ప్రియురాలు.
ఈ దారుణం విజయవాడ నడిబొడ్డున జరిగింది. తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో ప్రియుడు, అతడి సోదరిపై ఓ మహిళ పెట్రోల్‌పోసి తగులబెట్టింది. సనత్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో..అతడి సోదరి అక్కడికక్కడే చనిపోయింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
🔴వివరాల ప్రకారం…; ఖలీల్ తన భార్య, సోదరితో కలిసి సనత్‌నగర్‌లో నివసిస్తున్నాడు. అన్న భార్య ముంతాజ్‌తో అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే మూడు నెలల క్రితం ఖలీల్‌కు వివాహం జరగడంతో ముంతాజ్‌ని దూరంపెట్టాడు.
🔴చంపాలని వలపన్ని ఖలీల్, అతడి భార్యపై కక్ష పెంచుకున్న ముంతాజ్.. వారిని ఎలాగైనా చంపాలని కుట్రచేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం పెట్రోల్ బాటిల్‌తో ఖలీల్ ఇంటికి చేరుకుంది. మంచంపై నిద్రిస్తున్న ఖలీల్ పై నిప్పటించింది.
🔴అతడి భార్య అనుకుని ఖలీల్ పక్కన పడుకున్న సోదరి హజున్నీని..అతడి భార్యగా భావించి ఆమెనూ తగులబెట్టింది.ఖలీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు .కాని అతని సోదరి హుజున్నీ మాత్రం ఏ తప్పు చేయకుండానే తీవ్ర గాయాలతో చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
🔴రెండు నిమిషాల క్షణికావేశం అనవసరం గా నిండు ప్రాణాన్నీ బలి తీసుకుంది.ఏ పాపం తెలియని ఒక మహిళ మృతి కి కారణం అయ్యింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.