ఇప్పటి వరకూ ఉన్న నాయకులు విజయవాడ – గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని పెట్టి అక్కడే అభివృద్ధి జరిగేలా చేయడంతో పాటు వెనకపడిన ప్రాంతాలు అయిన రాయలసీమ, ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదు.
విశాఖలో మాత్రం ఒకటో రెండో ఐటీ కంపెనీలు పెట్టి, హుదూద్ వచ్చినప్పుడు కాస్త సిటీని క్లీన్‌గా చేసి మమ అనిపించేశారు. ఇక ఇప్పుడు విభజన ఏపీలో రెండో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖకు జగన్ అదిరిపోయే వరం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక నగరంగా ఉన్న విశాఖను ఏపీకి రెండో రాజధానిగా చేస్తే ప్రాంతాల మధ్య సమాన సమతుల్యత ఉంటుందన్న సరికొత్త డిమాండ్లు వైసీపీ తెరమీదకు తీసుకు వస్తోంది.
చంద్రబాబు సీఎం అయినప్పుడు విశాఖలోనే బాబు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. అప్పట్లో విజయవాడలో సౌకర్యాలు లేకపోవడం..తో తొలి మంత్రి వర్గ సమావేశం కోసం విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ని వాడారు. ఆ తర్వాత విశాఖను చంద్రబాబు, టీడీపీ వాళ్లు పూర్తిగా మర్చిపోయారు.
🔹రెండవ రాజధాని గా విశాఖ కోసం డిమాండ్ :ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండాలన్నా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా విశాఖను మరింతగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి.
ఇక ఇప్పుడు అనకాపల్లి నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్ ఆ డిమాండ్‌ను మళ్ళీ తెరమీదకు తీసుకువచ్చారు. విశాఖను ఏపీకి రెండో రాజధాని చేయడంతో పాటు ప్రతి యేడాది మూడు నెలల పాటు విశాఖను రాజధానిగా చేసుకుని ప్రభుత్వాన్ని నడపాలని ఆయన చెపుతున్నారు.తాము ఈ డిమాండ్‌ను జగన్ దగ్గర పెడతామని కూడా ఆయన చెపుతున్నారు. 👉ఇక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా విశాఖలోనే జరపాలని ఆయన కోరుతున్నారు. అప్పుడే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగి.. ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గుతాయని ఆయన చెపుతున్నారు. 👉మరి దీనికి సీఎం జగన్ ఏమంటారో చూడాలి.